కేఏ పాల్ తెలుగు రాష్ట్రంలో ఈ పేరు అందరికీ తెలిసిందే. అతను పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. 1963 సెప్టెంబర్ 25న విశాఖపట్నంలో జన్మించారు. పాల్ తల్లిదండ్రుల పేరు బర్నబాస్, సంతోషమ్మ. 19 సంవత్సరాల వయసులో క్రిస్టియన్ మినిస్ట్రీస్ లోకి అడుగుపెట్టారు.
క్రిస్టియనిటినీ ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ , జోస్పెల్ టు ది అన్ రీచ్ద్ మిలియన్స్ సంస్థలను స్థాపించారు. ప్రముఖ వ్యక్తులతో జయపాల్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కప్పుడుకే చెప్పాలి ప్రసంగాలు సభలకు లక్షల్లో జనం విచ్చేసేవారు.
ఇప్పుడు కేఏ పాల్ తన వైభవాన్ని కోల్పోయారు. ఎంతో డబ్బుని చారిటీల పేరుతో ఖర్చు చేసిన కూడా ఇప్పుడు తనకి అంత ప్రాముఖ్యత లభించడం లేదు. ఇక కేఏ పాల్ కుటుంబ విషయానికి వస్తే ఆమె భార్య పేరు మేరీ కీలారి. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. కేఏ పాల్ రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. 2019 ఎన్నికల సమయంలో తన భార్యను మీడియా ముందుకు తీసుకువచ్చి పరిచయం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీని స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. భీమవరం నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డ కేఏ పాల్ ఓటమి చెందారు. అయితే తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రతి నియోజకవర్గాన్ని అమెరికాల మారుస్తానంటూ హామీలు ఇచ్చారు. అయితే కేఏ పాల్ ప్రజాశాంతి అభ్యర్థులు ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కేఏ పాల్ పార్టీ పోటీ చేసింది.