జగ్గీ వాసుదేవ్. ఈ పేరు కంటే కూడా ఆ వ్యక్తి సద్గురు అనే పేరుతోనే చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆధ్యాత్మికతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తూ, మనిషికి స్ఫూర్తినిచ్చే ఎన్నో రకమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికతని కూడా పెంపొందించే కృషి చేస్తున్నారు. శివరాత్రి వచ్చింది అంటే, ఈషా ఫౌండేషన్ లో భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు. ఎంతో మంది గాయనీగాయకులు పాటలు పాడుతారు.
ఇటీవల కూడా శివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్ లో భక్తి కార్యక్రమం జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే సద్గురు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ మందికి తెలియదు. సద్గురు భార్య పేరు విజయ కుమారి. ఆమె కొంత కాలం క్రితం చనిపోయారు. వారి కూతురి పేరు రాధే. రాధే జగ్గీ పేరుతో ఆవిడ పిలవబడతారు. రాధే 1990 లో పుట్టారు. రాధే పుట్టకముందే ఆమె తల్లి, ఒకవేళ అమ్మాయి పుడితే డాన్స్ నేర్చుకుంటుంది అని అనుకున్నారట. దాంతో రాధే భరతనాట్యం నేర్చుకున్నారు. భరతనాట్యంలో శిక్షణ పొందారు. సద్గురు రాధేని ఎప్పుడూ ఒక అమ్మాయిలాగా చూడలేదు.
చాలా సార్లు తన కూతురు తనకంటే తెలివిగల వారు అని చెప్తూ ఉంటారు. రాధే తన తండ్రిని నాన్న అని పిలవకుండా, ఆయన మొదటి పేరుతో పిలుస్తారు. చాలా మంది దానికి అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా, సద్గురు, తన కూతురు కళ్ళకి తాను అలాగే కనిపిస్తాను అని, తన కూతురు తనని అలాగే చూస్తారు అని అన్నారట. విజయ కుమారి గారి మరణం తర్వాత రాధే చాలా కృంగిపోయారు. ఆ తర్వాత తండ్రి సంరక్షణలోనే పెరిగారు. 2014 లో సందీప్ నారాయణన్ తో రాధే వివాహం జరిగింది. వీరి పెళ్లి ఈషా ఫౌండేషన్ కాంపౌండ్ లోనే జరిగింది. వారి పెళ్లి ఘనంగా జరిగినా కూడా మీడియా కవరేజ్ లేకుండా చేసుకున్నారు.
రాధే ఒక నృత్యకారిణి. భరతనాట్య నృత్యం ద్వారానే ఆమె సంపాదిస్తారు. ఆమె ఇష్టాన్నే తన వృత్తిగా చేసుకున్నారు. కళాక్షేత్రలో రాధే భరతనాట్య నృత్యం చేస్తూ ఉంటారు. ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చారు. రాధే పుట్టకముందే తన తల్లిదండ్రులు కళాక్షేత్రకి వెళ్లారు. అక్కడ నృత్యం చేస్తున్న అమ్మాయిలని చూసి రాధే తల్లి విజయ కుమారి గారు ముచ్చటపడేవారట. తన కూతురిని కూడా అలాగే భరతనాట్య నృత్యకారిణి చేయాలి అని అనుకున్నారట. రాధే, సద్గురుతో పాటు కూడా చాలా ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటారు.
ALSO READ : NARA BRAHMANI: మూడు రోజులుగా వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక కథ ఏంటంటే.? ఈ ఫోటో ఎక్కడ అంటే.?