వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో.. సందుకో పందిరి వెలుస్తోంది. అందరు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని భక్తి కోసం చేసినా.. గొప్ప కోసం చేసినా.. చివరకు ఎదురయ్యే సమస్య నిమజ్జనం.
ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడం కష్టతరం గా మారుతోంది. ఎక్కువ మంది నిమజ్జనం చేయడానికి వస్తుండడం తో.. సమయం పడుతుండడం తో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆటోమేటిక్ హుక్ రిలీజ్ సిస్టం లాంటి విధానాలను ఉపయోగిస్తూ.. నిమజ్జనాలను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఓ ఇంజనీర్ ఈ సమస్యకి చాలా సింపుల్ పరిష్కారాన్ని కనుగొన్నారు. కాంటాక్ట్ లెస్ కాన్సెప్ట్ తో ఈ నిమజ్జనాన్ని మరింత వేగవంతం చేయాలని ఇంజనీర్ మురళీధర్ ప్రయత్నించారు.
అందుకు తగ్గట్లే క్రేన్ ప్లాట్ ఫామ్ లో కొన్ని మార్పులను కూడా చేసారు. ఇందుకు సంబంధించి ఓ డెమో ను కూడా ట్యాంక్ బ్యాండ్ వద్ద నిర్వహించారు. బెలూన్ ని నీళ్లలో ముంచితే అది పైకి తేలుతుంది. ఇదే సూత్రాన్ని ఉపయోగించి వినాయక నిమజ్జనాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు క్రేన్ ప్లాట్ ఫామ్ పై ఒక వైపు ధర్మ కోల్ షీట్ లేదా ప్లాస్టిక్ ఎయిర్ టైట్ ప్లాస్టిక్ డ్రమ్స్ ని ఏర్పాటు చేస్తారు. దీనితో.. నీళ్లలో ఈ ప్లాట్ ఫామ్ మునగగానే మనుషుల అవసరం లేకుండా విగ్రహం నిమజ్జనం అయిపోతుంది. పది నిముషాలు పట్టే సెకండ్లలోనే అయిపోతుంది. ఐడియా అదుర్స్ కదా..