ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. శివాలయం చిన్నగా లేదా పెద్దగా ఉన్నా భక్తులు అక్కడికి వెళ్లి పూజలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అక్కడ ఉన్న శివాలయాలలో ఒక శివాలయం భైరవకోనలో ఉంది.
శివాలయం ఒకటే కాదు, దుర్గా దేవి ఆలయం, త్రిమూర్తుల ఆలయం, గ్రానైట్ శిలలతో చెక్కబాదిన శివలింగాలు, ఆకాశగంగలా అనిపించే జలపాతం, ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటాయి. ఇవే కాక ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రాత్రి జరిగే విశేషం చూడడానికి వేలాది భక్తులు వస్తారు. అడి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భైరవకోన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి అనే గ్రామానికి సమీపంగా వుంది. కొత్తపల్లి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్య క్షేత్రం కలదు.చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, భైరవకోన ఆలయ చరిత్ర 7వ శతాబ్దానికి చెందినది. ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే, ఒకప్పుడు కాల భైరవుడు ఈ ప్రాంతాన్ని పాలించాడని అందువల్లనే దీనికి భైరవకోన ఆలయం అని పేరు వచ్చిందని అంటారు. కాల భైరవుడు ఈ ప్రదేశానికి కాపలాగా ఉంటాడని చెబుతారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పురాతన హిందూ దేవాలయాలు కనుగొన్నది భైరవకోనలోనే. ఇక్కడ 8 హైందవ దేవాలయాలున్నాయి. పల్లవరాజులు ఈ శివాలయాలను అద్భుతంగా నిర్మించారు. కొండల్ని గుహాలయాలుగా మలచటం పల్లవరాజుల కాలంలోని గొప్ప కళ. ఇక ఈ గుహల గోడల పైన పల్లవుల కాలంలోని అనేక శిల్పకళలను చూడవచ్చును. వీటిని పల్లవ శిల్పులు అయిన దేరుకంతి, శ్రీశైలముని వంటివారు భైరవకోన క్షేత్రాన్ని మలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఒకే కొండలో 8 ఆలయాలు, వాటి చుట్టూ ఎటు చూసినా నల్లమల అడవులు 8 ఆలయాలలో దేవుళ్ళు శిలా రూపంలో దర్శనమిస్తారు.
ఇక్కడ ఒకే కొండలో 8 ఆలయాలు చెక్కిన విధానం ఎంతో అపురూపంగా ఉంటుంది. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, నగరికేశ్వర, విశ్వేశ్వర, మల్లికార్జున, భార్గేశ్వర, రామేశ్వర, పక్షమాలిక లింగ. ఇందులో 7 దేవాలయాలు తూర్పుముఖానికీ ఉండగా, ఒకటి దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. ఆలయాలలోని శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కారు. ఇక్కడ త్రిమూర్తులను ఒకే ఆలయంలో పూజిస్తారు. శివలింగం మధ్యలో ఉండగా గుహ గోడల పై ఒకవైపు గోడ పై బ్రహ్మ, మరొక వైపు గోడ పై విష్ణువులు శిల్పారుపాలలో ఉన్నారు.
శివాలయాలన్నీ పై వరసలో ఉండగా, కింద ఉండే ఆలయంలో త్రిముఖ దుర్గ, శివలింగం పూజలు అందు కుంటున్నాయి. దుర్గ దేవి ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలతో ఉంటుంది. దుర్గాదేవి కుడివైపున మహాకాళి ముఖం, నోట్లోంచి జ్వాల వస్తున్నట్టుగా వుంటుంది. మధ్యన మహాలక్ష్మి, ప్రసన్నమైన ముఖం. ఎడమవైపున ముఖం సరస్వతీదేవి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీ దేవి అద్దం చూసుకుంటూ కనిపిస్తుంది.
అమ్మవారి విగ్రహం పైన కార్తీకపౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడటం భైరవకోన మరో విశేషం. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్ర బింబం, దుర్గ ఆలయాలనికి 3 అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, ఆ చంద్ర కిరణాలు దుర్గాదేవి విగ్రహం పై పడుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తారు.
Also Read: గురు పౌర్ణమి నాడు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే అంతా శుభమే..!



























పాండవులు మరియు ద్రౌపది మరణం గురించి మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో చెప్పబడింది. పాండవులు హస్తిన పురాన్ని విడిచి వెళ్లేముందు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ ను రాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత హిమాలయాలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వీరిని ఒక కుక్క అనుసరిస్తుంది. పాండవులు ద్రౌపదితో దారిలో కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని హిమాలయాలను దాటరు. ఈ క్రమంలో ముందుగా ద్రౌపది క్రింద పడి మరణిస్తుంది.
అప్పుడు భీముడు ద్రౌపది మరణానికి ధర్మరాజుని కారణం అడుగుతాడు. దానికి ద్రౌపదికి పాండవులు అందరు భర్తలు అయినప్పటికీ, ఆమె అర్జునుడి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటుందని చెప్పాడు. ప్రయాణం సాగిస్తూ ఉండగా సహదేవుడు పడిపోయాడు. అప్పుడు భీముడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు అని అడిగినపుడు తనకున్న జ్ఞానానికి అతడు ఎల్లపుడూ గర్వంతో ఉండేవాడని అందువల్లనే అతను పడిపోయాడని చెప్పాడు. ఆ తరువాత నకులుడు కింద పడిపోగా, ధర్మరాజు భీమునితో నకులుడు తన అందం పట్ల ఎక్కువగా గర్వపడ్డాడు. ఆ పాపం వల్లే పడిపోయాడని చెప్పాడు.
ఆ తర్వాత అర్జునుడు పడిపోయినపుడు, ధర్మరాజు భీమునితో యుద్ధానికి ముందు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తన శక్తితో ఒక్కరోజులోనే ముగించగలనన్న నమ్మకంతో ఉండేవాడని, కానీ అలా చేయలేకపోయాడని, అంతేకాకుండా, అతను ఎప్పుడూ ఇతర విలువిద్య నిపుణులను తక్కువ చూసేవాడని చెప్పాడు. అయితే ఆ తరువాత భీముడు పడిపోతూ నేనేం పాపం చేశాను అని అడిగినపుడు ధర్మరాజు నువ్వు అతిగా తినేవాడివని, నీ శక్తి సామర్ధ్యాల గురించి ప్రగల్భాలు చెప్పేవాడివని, ఇతరులను అగౌరవపరిచేవాడివని చెప్పాడు.
చివరగా ధర్మరాజు ముందుకు వెళ్ళగా ఆయనను కుక్కను అనుసస్తుంది. వారి ముందు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పగా, డానికి ధర్మరాజు ద్రౌపదిని, తన సోదరులను కూడా వెంట స్వర్గానికి తీసుకెళ్లాలని అడుగుతాడు. ఇంద్రుడు వారు ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నారని చెప్పడంతో, తనతో పాటు కుక్కను స్వర్గానికి తీసుకెళ్లలాని కోరుతాడు. కుక్కకు స్వర్గ ప్రవేశం లేదని చెప్పడంతో అక్కడే ఉండిపోతానని ధర్మరాజు చెప్తాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి తన గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చానని వెల్లడిస్తాడు. పాండవులలో ఒక్క ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గంలో ప్రవేశిస్తాడు.