మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ ఇంట్లో గాని, వ్యక్తిలో గాని అభివృద్ధి కనిపించకపోతే కచ్చితంగా మానవతీత శక్తి ఒకటి మనకి అవరోధంగా ఉందని ఆలోచించాలి. మన కష్టానికి దైవానుగ్రహం తోడైతేనే మన అభివృద్ధి బాగుంటుంది. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ మన చేతిలో డబ్బులు నిలవక పోవటం, మన కుటుంబంలో శాంతి లేకపోవటం, మన జీవితంలో అభివృద్ధి సాధించలేకపోవడం వంటివి జరుగుతున్నాయంటే కచ్చితంగా ఎక్కడో ఏదో దోషం ఉన్నట్లు లెక్క.
ముందుగా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమో పరిశీలించండి. మీ ఇంటి టెర్రస్ పై ఈ వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. టెర్రస్ పై ఈ వస్తువులు లేకుండా చూడండి. అవేమిటో చూద్దాం. ఇంటి టెర్రర్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా లేని టెర్రస్ లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. టెర్రస్ ఎప్పుడూ మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది.

నీలం పువ్వులు ఉన్న మొక్కలను ఉత్తర దిశలో, పడమర దిశలో తెల్లని పువ్వులతో కూడిన మొక్కలను నాటడం వలన పిల్లలలో సృజనాత్మక శక్తి పెరుగుతుందని పెద్దలు చెప్తారు. అలాగే టెర్రస్ పై వాటర్ ట్యాంక్ ని పెట్టినట్లయితే దానిని నైరుతి దిశలో ఉండేలాగా చూసుకోండి. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ టెర్రస్ పై తుప్పు పట్టిన ఇనుము లేదా వెదురు వస్తువులను ఉంచకండి, దీనివల్ల రాహు దోషం పెరుగుతుంది. అలాగే టెర్రస్ లేదా ఇంటి పైకప్పు ఎప్పుడూ శిధిలమై ఉండకూడదు.

వాస్తు విశ్వాసాల ప్రకారం పైకప్పు పగుళ్లు, వర్షాకాలంలో తేమ కారణంగా ఇంట్లో తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడుటమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది.అలాగే చీపురు కట్ట ఇంటిపై కప్పు పై ఉంచకూడదు. చీపురు ఇంటి టెర్రస్ పై ఉంటే దొంగతనాల భయం నెలకొంటుంది. జాగ్రత్తలు పాటిస్తూనే లక్ష్మీదేవిని నిత్యం ప్రసన్నం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తో పాటు జీవితంలో అభివృద్ధి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.






రామాయణంలో కీలకమైన ఘట్టాలలో సీతాదేవి అపహరణ కూడా ఒకటి. అదే రావణాసురుడి చావుకు కారణం అయ్యింది. వనవాసంలో ఉన్న సమయంలో రావణాడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం, ఆ తరువాత అశోకవనంలో బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ లో రావణాడు సీతను పట్టుకోకుండా గాల్లో తీసుకెళ్తాడు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి ఉన్న భూమిని పెకిలించి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. మరి రావణాడు సీతమ్మను తాకకుండా తీసుకెళ్లాడానికి కారణం కుబేరుడి కుమారుని శాపం.
రావణాసురుడు తనకి కోడలితో సమానం అయిన రంభను ఒకసారి బలవంతం చేస్తే, రంభ ప్రియుడు అయిన కుబేరుడి కుమారుడు నలకుబేరుడు రావణాసురుడు పరాయి స్త్రీని బలవంతంగా ముట్టుకుంటే రావణాసురుడి పది తలలు పగిలిపోయేలా శాపం పెడుతాడు. రావణాసురుడు సీతాదేవి అనుమతి లేకుండా ముట్టుకుంటే తన పది తలలు పగిలిపోతాయి. అందుకే రావణాడు సీతను గాల్లో తీసుకెళ్తాడు.
ఆ తరువాత రావణాసురుడు సీతాదేవి తాకకుండా అశోకవనంలో ఉంచుతాడు. శ్రీ రాముడు ఆంజనేయుడి సహాయంతో లంకలో ఉన్న సీతాదేవి జాడను కనుగొని, వారధి కట్టి, రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడిని సంహరించి సీతాదేవి తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు. నల కుబేరుడు శాపం వల్ల రావణాసురుడు సీతాదేవిని తాకడానికి భయపడతాడు.













అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.