సైబర్ నేరాలు జరగడం ఈ రోజుల్లో చాలా మాములు విషయం అయిపొయింది. మనం వాడే మొబైల్ లేదా, లాప్ టాప్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఆక్టివ్ గా ఉంది అంటే చాలు మన డేటా విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం నెట్టింట్లో ఉన్నాం అంటే మన డేటా పబ్లిక్ గా ఉన్నట్లే.
చాలా మంది కేటు గాళ్ళు మన డాటాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను హాక్ చేస్తూ మనకే వెన్నుపోటు పొడుస్తుంటారు. అడిగినంత డబ్బు సమర్పిస్తే తప్ప మన డేటా తిరిగి సేఫ్ గా వస్తుందన్న గ్యారెంటీ లేదు.
చదువుకున్న యువత కూడా ఇలాంటి సైబర్ మోసాలల్లో ఈజీగా చిక్కుకుంటోంది. అయితే నిరుద్యోగం పెరుగుతున్న క్రమంలో కొందరు యువతీ యువకులు ఉద్యోగం వస్తుందన్న ఆశతోనో.. కష్టాలు గట్టెక్కుతాయన్న ఉద్దేశ్యంతోనే తొందరపడి ఇలాంటి కేటు గాళ్ళ వలలో చిక్కుంటున్నారు. ఆ తర్వాత లక్షల రూపాయల డబ్బుని పోగొట్టుకుని విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వంశి కృష్ణ అనే ఈ కేటుగాడు నిరుద్యోగ యువతను మోసం చేసాడు.
వీరిలో ఏకంగా 500 ల మంది అమ్మాయిలే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విడాకులు తీసుకున్న అమ్మాయిలు, వితంతు మహిళలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఈ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తంగా ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆన్ లైన్ లో విడాకులు తీసుకున్న మహిళలను, వితంతువులను టార్గెట్ చేసిన వంశి కృష్ణ స్కీం ల పేర్లు చెప్పి అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.



























కోయంబత్తూరు సోమయం పాల్యంకు చెందినటువంటి ప్రశాంత్.. రఘునాథ పురానికి చెందినటువంటి హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా దగ్గర అయిపోయారు. అది ఎంతలా అంటే ఒకరికొకరు ఏదైనా చేసే అంత.
ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు చాలా అలవాటు పడ్డాడు. వాటి కోసం పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. దీంతో అప్పిచ్చిన వాళ్లంతా ప్రశాంత్ పై ఒత్తిడి చేయడంతో ఆ విషయాన్ని తన లవర్ తేజస్వికి చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరూ ఎలాగైనా మనీ సంపాదించాలని ఈజి మని కోసం దొంగతనాల బాటపట్టారు. తేజస్వినికి స్కూటీ కూడా ఉంది. ఆ బండి పై తొండమూత్తూరు వైపు వెళ్లారు.
అక్కడ ఫైర్ స్టేషన్ సమీపంలో మేకలు కాస్తున్న వృద్ధురాలి దగ్గరికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లారు. ఆ ముసలావిడను అడ్రస్ అడిగినట్టే అడిగి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్కూటీపై ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టి తేజస్విని బైక్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా అడ్రస్ పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టైల్ లో విచారించగా జరిగిన విషయం అంతా ఒప్పుకున్నది. కొన్ని నెలల కిందట ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా కనిపించడం లేదని ప్రశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ప్రశాంత్ ఆ బంగారాన్ని దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నామని ప్రశాంత్ తెలియజేశాడు. దీంతో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ మరియు తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు బడా వ్యాపారస్తులే..