ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. వాటిల్లో కులాంతర వివాహాలే ఎక్కువ ఉంటున్నాయి. పెళ్లి చేసుకోవడానికి కులం అడ్డుకాకపోయినా.. చాలా మంది కుటుంబాలలో పెద్దలు కులాంతర వివాహాలను అంగీకరించడం లేదు. ఈ క్రమంలో పెద్దలకు, పిల్లలకు మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి.
పెద్దలకు దూరంగా పారిపోయి పెళ్లి చేసుకున్న పిల్లలు తమ తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. మరో వైపు పిల్లల ప్రేమను అర్ధం చేసుకోకుండా హింసించే తల్లి తండ్రులు పిల్లల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు.
తాజాగా.. ఇటువంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన ఓ యువ జంట ప్రేమించుకుంది. ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులకు కూడా తెలియ చేసారు. అయితే.. వీరిద్దరికి పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరించలేదు. కానీ.. వీరిద్దరూ తమ ప్రేమని దూరం చేసుకోలేక.. ఇంట్లో పెద్ద వాళ్లకు తెలియకుండా ఓ గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఈ విషయం తెలిసిన పెద్దలు ఇంటికి తిరిగి రావాలని, మళ్ళీ ఘనంగా పెళ్లి చేస్తామని చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ మధుబని రాష్ట్రానికి చెందిన హర్లాఖి ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు, సీతామర్హి ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతీ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకి పెద్దలు అడ్డు చెప్పేసరికి వారికి తెలియకుండా ఆలయంలో వివాహం చేసుకున్నారు. చివకు పెద్దలు దిగొచ్చి.. ఘనంగా పెళ్లి చేస్తామని చెప్పినా వీరు వినలేదు. సదరు యువతీ తల్లితండ్రులు కూతురుకి ఫోన్ చేసి పెళ్లి చేస్తామని, తిరిగి ఇంటికి రావాలని కోరినా.. ఆమె ఒప్పుకోలేదు. “మా తల్లి తండ్రులు మాకు మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పి.. మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతున్నారని.. మా కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉందని.. మాకు ఏదైనా జరిగితే.. దానికి కారణం నా మేనమామ, తల్లితండ్రులే కారణం” అని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.




ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.















