ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు. మార్చి 17న సద్గురు అనారోగ్యం పాలవ్వడంతో హుటాహుటిన ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పరిశీలించి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి మెదడు విపరీతంగా వాచి రక్తస్రావం అవుతుందని గుర్తించి సద్గురు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది అని ఆయన నిరంతరం వాంతులు, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
అత్యవసరంగా సర్జరీ చేసారు వైద్యులు. ప్రస్తుతం సద్గురు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ సైతం తొలగించినట్లు వివరించారు. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. సద్గురు ప్రస్తుత వయసు 66 సంవత్సరాలు. MRI స్కాన్ ద్వారా 3,4 వారాలుగా బ్రెయిన్లో బ్లీడింగ్ జరుగుతుందని గుర్తించారు వైద్యులు. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో సద్గురు బాధపడుతున్నట్లు ఆయన శిష్యలు తెలిపారు.
డా. వినిత్ సూరి, డా. ప్రణవ్ కుమార్, డా. సుధీర్ త్యాగి, డా.ఎస్ ఛటర్జీలతో సహా ఢిల్లీకి చెందిన అపోలో వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసింది. సద్గురు బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన విషయాన్ని ఇషా ఫౌండేషన్ తన X ఖాతాలో పోస్ట్ చేసింది.తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 మార్చి 2024న జరిగిన మహా శివరాత్రి వేడుకలను కూడా సద్గురు పాల్గొన్నారు.
సర్జరీ అనంతరం సద్గురు మాట్లాడుతూ తన తలకు జరిగిన ఆపరేషన్ గురించి ఆందోళన చెందవద్దని వైద్యులు నా కపాలం తెరిచి ఏదైనా ఉందేమో కనుక్కునేందుకు ప్రయత్నించారు అంటూ హాస్యాస్పదంగా తెలిపారు. లోపల ఖాళీగా ఉండటంతో వారు విసిగిపోయి తలకు కుట్లేసి ఆపరేషన్ ముగించారు అన్నారు. ప్రస్తుతం తలకి కట్టు ఉంది. బ్రెయిన్ కి మాత్రం ఏం డామేజ్ అవ్వలేదు అన్నారు.
An Update from Sadhguru… https://t.co/ouy3vwypse pic.twitter.com/yg5tYXP1Yo
— Sadhguru (@SadhguruJV) March 20, 2024