అన్ని దానాలలో అన్నదానం నిజంగా గొప్పది. ఎవరికైనా అన్నం పెడితే మనకి పుణ్యం వస్తుంది. తాజాగా కలకత్తాకు చెందిన ఒక మహిళ సోదరుడి పెళ్ళిలో మిగిలిపోయిన ఆహార పదార్ధాలని ఆకలితో ఉన్న వాళ్ళకి పంచి పెట్టడం జరిగింది. పెళ్లి రోజు మిగిలిపోయిన భోజనాలని ఏకంగా ఆమె రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న అనాధలకి వడ్డించారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన ఈ మంచి పనిని చూసి అందరూ అభినందిస్తున్నారు. పెళ్లిళ్లు అంటే ఎక్కువగా భోజనాలు మిగిలిపోతుంటాయి.

అయితే అలాంటి వాటిని లేని వారికి ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది అని మంచి మనసుతో కలకత్తాకు చెందిన పాపియ కర్ అనే మహిళ తన సోదరుడు వివాహం లో మిగిలిపోయిన ఆహార పదార్ధాలని కలకత్తా సబర్బన్ రైల్వే స్టేషన్ రాణాఘాట్కు తీసుకువెళ్లారు. అక్కడ అనాధలకు స్వయంగా ఆమె వడ్డించి కడుపునిండా భోజనం పెట్టించారు. నిజంగా ఇలాంటి వాళ్ళని మిగిలిన వారు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి.






















