బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి ఎలిమినేట్ అవ్వడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కొంత మంది అభిమానులు రవి మళ్ళీ షోకి తిరిగి రావాలి అంటూ ధర్నా చేసారు.