పూజ హెగ్డే తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలు చేసింది. ఈ సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈలోపునే.. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ లో కూడా ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ కి పూజ కూడా ఒకే చెప్పేసింది.. దాదాపు ఖాయమైపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి.