మొదటి వారం వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ లో దుమ్ము దులిపేసిన సందీప్ కిషన్ సినిమా ఊరి పేరు భైరవకోన. వీక్ డేస్ వచ్చిన తర్వాత స్పీడ్ తగ్గినా కుడా బానే ఆడుతుంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన సినిమాకి స్టార్టింగ్ నుంచి మంచి హైప్ ఉంది. ఈ సినిమాలో పాటలు, మ్యూజిక్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తిని పెంచాయి.
ఈ సినిమా పాటలు గత ఆరునెలల నుంచి ట్రెండింగ్ లోనే ఉన్నాయి.ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అనుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ కూడా అందరికీ తెగ నచ్చేసి థియేటర్ల వద్దకు దూసుకుని వెళ్తున్నారు ప్రేక్షకులు. కిందటి శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు వీకెండ్ కలెక్షన్లు బానే వచ్చాయి. వీక్ డేస్ లో కొంచెం ఊపు తగ్గినా కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లోనే ఉంది ఈ సినిమా.
నాలుగో రోజు 55 లక్షల రేంజ్ లో షేర్ ని, ఐదో రోజు 41 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇదే రేంజ్ లో కంటిన్యూ అయ్యి రెండో వారంలో కూడా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయితే ఈజీగా బ్రేక్ ఈవెన్ ఐపోయి క్లీన్ హిట్ గా నిలుస్తుంది ఈ సినిమా. వచ్చేవారం మంచి పేరున్న సినిమాలు ఎక్కువ రిలీజ్ కి లేకపోవడంతో, ఈ సినిమా బ్రేకింగ్ అవడానికి ఛాన్సులు బానే ఉన్నాయి.
ఈ సినిమా ఐదు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లలోకి వస్తే నైజాంలో 2.81 కోట్లు, ఏపీ మొత్తంలో 2.92 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంలో 6.36 కోట్లు (11.90 కోట్ల గ్రాస్) తో వరల్డ్ వైడ్ గా మొత్తం 8.33 కోట్లు(16.20 కోట్ల గ్రాస్) సంపాదించింది ఈ చిత్రం. 11 కోట్లతో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 2.67 కోట్ల రేంజ్ లో షేర్ నీ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.