#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
మామూలుగా పెళ్లి అంటే ఆడపిల్లలు సిగ్గుతో తలదించుకుని ఉంటారు అనే ఒక అపోహ ఉంది. అదంతా చెరిపేస్తూ ఆడ పిల్లలు కూడా తమ పెళ్లి వేడుకని ఆనందంగా జరుపుకుంటారు అని ఎంతోమంది అమ్మాయిలు నిరూపించారు. ఇటీవల ఒక యువతి కూడా అలాగే తన పెళ్లిలో బారాత్ లో డాన్స్ వేస్తూ వైరల్ అయ్యారు.

జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఈ నెల 14వ తేదీన అశోక్ తో వివాహం జరిగింది. అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అయితే శ్రీయ బారాత్ లో బుల్లెట్టు బండెక్కి పాటకి డాన్స్ వేశారు. ఈ పాటని మోహన భోగరాజు పాడారు. ఈ ఆల్బమ్ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదలయి వైరల్ అయ్యింది.

ఈ పాట బాగా వైరల్ అవడం తో పాటు శ్రీయ కు మంచి ఆఫర్ కూడా వచ్చింది. ఆమె డాన్స్ వేసిన పాటను బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ నిర్మించింది. లక్ష్మణ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా.. గాయని మోహన భోగరాజు ఈ పాటను ఆలపించారు. ఈ పాట వైరల్ అయినా నేపధ్యం లో సంస్థ నిర్వాహకులు నిరూప సాయి శ్రీ తో ఫోన్ లో ముచ్చటించారు. తమ సంస్థ ఆధ్వర్యం లో నిర్మించే మరో పాటకు నటించాలంటూ సాయి శ్రీయ ను కోరారు. శ్రీయ కూడా అందుకు సంతోషం తో అంగీకారం తెలిపారు.
అదృష్టం అంటే ఇదే అనుకుంటా …కేరళలో ఓ ఉపాధ్యాయుడికి భయానక అనుభవం ఎదురైంది..ఓ వ్యక్తి తన తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకున్నాకా కానీ అతనికి అసలు విషయం అర్ధం కాలేదు….కేరళకు చెందిన రంజిత్, సంస్కృత భాషా ఉపాధ్యాయుడు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 5న కందనాడ్‌లోని మేరీ హైస్కూల్లో తరగతులు ముగించుకుని మరో స్కూల్‌కు ద్విచక్ర వాహనంపై ప్రయాణం అయ్యాడు.మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఎలాంటి అనుమానమూ రాలేదు.తీరా స్కూలుకు చేరుకున్నాక హెల్మెట్ తీసి చూసుకుంటే విష సర్పం కనిపించింది. ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు.

రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు.కేరళలో ఈ మధ్య పాముల బెడదపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2019, డిసెంబర్లో ఓ వ్యక్తి బావిలో పడ్డ అనకొండను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సహసికుడిని షంగీల్ అని తర్వాత తెలిసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలవబోతోంది. ఈ ప్రోగ్రాం కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఇందులో కంటెస్టెంట్ పేర్లు అంటూ చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. కానీ, వారిలో ఎవరు నిజంగానే హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారో అనే విషయం మాత్రం ఇంకా కచ్చితంగా తెలియదు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక వ్యక్తి పేరు వినిపిస్తోంది. జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయిన వర్ష ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నారట.

వర్ష అంతకు ముందు ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో కూడా నటించారు. కానీ జబర్దస్త్ మాత్రం వర్షకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకుల అందరికీ ఇంకా దగ్గరయ్యారు వర్ష. ఇప్పుడు వర్షం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనే వార్త మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజమో, ఎంతవరకు కల్పితమో తెలియాలి అంటే ఇంక షో మొదలు అయ్యేంత వరకు ఆగాల్సిందే.
ఈ మధ్య కాలం లో చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ వచ్చే సంపాదన కంటే చిన్న చిన్న వ్యాపారాలతోనే ఎక్కువ గా సంపాదించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. చదువుకోవడానికి వీలు లేక.. ఎదో ఒక ఆసరా కోసం ఎదురుచూసే వారు ఇలా తక్కువ పెట్టుబడిలతోనే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. వారిలోనే కోటీశ్వరులు అవుతున్న వారు కూడా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లో కాన్పూర్ నగరం లో చూస్తే ఇలాంటి వారు చాలామందే కనిపిస్తారు. ఓ బిజీ రోడ్డు పై ఉండే మిరపకాయ బజ్జి బండి ని చూస్తే.. ఎవరైనా ఎదో పొట్టకూటి కోసం పెట్టుకుని ఉంటారు అనుకుంటారు. కానీ, ఆ వ్యాపారి కోటీశ్వరుడు అంటే ఎవరైనా నమ్మగలరా? ఆ పక్కన ఉండే మరో బండి వాడిది కూడా అదే బాపతు. ఇలా చూస్తూ పొతే.. దాదాపు ఓ రెండొందల యాభై బండ్ల వరకు ఉన్నాయి.

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ వారు రైడ్ చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి. కేవలం బజ్జి బండి పెట్టుకున్నా.. వారి ఇంటికి వెళ్లి చూస్తే రాజవైభోగాలే ఉంటాయట. పెద్ద పెద్ద కార్లతో పాటు.. ఆస్తులు కూడా ఉన్నాయి అని తెలుస్తోంది. దేశం లో ఇష్టానురాజ్యం గా సంపాదిస్తూ.. ఆదాయపు పన్నుని కట్టకుండా ఉండేవారు చాలా మండే ఉన్నారు. వారిపై ఐటి శాఖ కొరడా ఝళిపించాలని భావిస్తోంది. ఈ క్రమం లో రోడ్ సైడ్ వ్యాపారాలు చేస్తున్నవారిపై ఐటి శాఖ కన్నేసింది.

వారితో విచారణ తేలాక అందరు దండిగానే సంపాదిస్తున్నట్లు గుర్తించింది. గత నాలుగేళ్ళ కాలం లో ఏకం గా 375 కోట్ల రూపాయలను సంపాదించినట్లు గుర్తించింది. అంతే కాదు వారికి కాన్పూర్ పరిసరాలైన హులాగంజ్, ఆర్య నగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్ వంటి ప్రాంతాల్లో కూడా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. పాన్ షాపు నిర్వాహకులు గతేడాదితో ఐదు కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు.

ఇక శానిటైజర్ వర్కర్లు, పానీ పూరి, వడాపావ్ వంటి బండి పెట్టుకునే వారు కూడా గతేడాది కాలం లో బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బండి పెట్టుకునే ఓ యజమాని తాను అద్దెకి తీసుకున్న కార్లకు నెలకు లక్షా పాతికవేల అద్దెను చెల్లిస్తున్నట్లు బయటపడింది. వీరు లక్షల్లో.. కోట్లల్లో వ్యాపారం చేసుకుంటూ కూడా ఆదాయపు పన్ను శాఖ కు ఏ విధమైన పన్నులు కట్టడం లేదని గుర్తించారు. ఐతే వీరిలో చాలా మంది కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు కొన్నారు. కొందరు ఎలాంటి పర్మిషన్లు లేని చిట్టీలు, ఫైనాన్స్ సంస్థల్లో కొంత డబ్బుని దాచారు.

అయితే ఆస్తులు కొనుగోలు చేసే సమయం లో వీరి ఆధార్ కార్డు ను వినియోగించడం వల్లనే వీరి వివరాలు ఐటి శాఖకు తెలిసాయి. గతం లో కూడా ఇలాంటి రహస్య కోటీశ్వరులను, పన్నులు కట్టకుండా కోట్లలో వ్యాపారం చేస్తున్నవారిని ఐటి శాఖ గుర్తించింది. ప్రస్తుతం పూర్తి విచారణ జరిపి.. పన్నులు కట్టని వారి ఆస్తులను ఐటి శాఖ సీజ్ చేసింది.
హెచ్ సి యు హాస్టల్ లో నే ఎంటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మ హత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే, ఆర్.మౌనిక (27) పెద్దపల్లి జిల్లా కు చెందిన కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన దంపతులు రఘుశాల లచ్చయ్య, రజిత ల కుమార్తె. హెచ్ సి యు లో నానో టెక్నాలజీ కోర్స్ లో ఎంటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది.

క్యాంపస్ లోనే బాలికల వసతి గృహం 2 లో ఆమె గత కొన్ని రోజులు గా ఉంటోంది. ఎంటెక్ విద్యార్థినులను క్యాంపస్ లోకి అనుమతించడం తో ఆమె ఇటీవలే ఊరినుంచి హాస్టల్ కి వచ్చింది. కాగా సోమవారం ఉదయం ఆమె తన గదిలోంచి బయటకే రాలేదు. ఇతర విద్యార్థులు వెళ్లి పిలిచినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం తో అనుమానం ఎక్కువ అయింది.

లోపల ఏమి చేస్తోందో అని కిటికీ తలుపులు తెరచి చూడగా.. ఆమె పైకిటికీ చువ్వకు ఉరి వేసుకుని కనిపించింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆమె హాస్టల్ లో ఉంటోంది. ఆమె తండ్రి లచ్చయ్య ఊరిలో వ్యవసాయం చేస్తుంటారు. పదవతరగతి వరకు ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది.

ఆ తరువాత బాసర ట్రిపుల్ ఐటి లో సీటు రావడం తో అక్కడ డిగ్రీ పూర్తి చేసి, హెచ్ సి యు లో ఎంటెక్ చదువుతోంది. “ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యు నాన్న.. అమ్మా ” అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది.
అయితే ఈ ప్రోగ్రాం పేరు వెనకాల ఒక కథ ఉంది. అదేంటంటే, స్టార్ మా లో అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అదే పేరు ఉండకూడదు అని ఎవరు మీలో కోటీశ్వరుడు అని మార్చారట జెమినీ టీవీ బృందం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, “ఈ ప్రోగ్రాం కి మగవాళ్ళు మాత్రమే కాదు. ఆడవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి కోటీశ్వరుడు అని కాదు. కోటీశ్వరులు అని పెట్టండి” అని చెప్పారట. దాంతో ప్రోగ్రాం పేరు ఎవరు మీలో కోటీశ్వరులు అయ్యింది.
ఇటీవల జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో వెంకీ మంకీస్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇందులో వెంకీ ఎమోషనల్ అయ్యారు. వెంకీ మాట్లాడుతూ మొత్తం చేసేది నేను వాళ్ళ చేత చేయించేది నేను అని అన్నారు. అందుకు మనో గారు అవును కానీ వాళ్ళు అందరూ చాలా బాగా చేస్తున్నారు కదా అన్నారు. అందుకు వెంకీ ఎమోషనల్ అయ్యారు. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వెళ్లి రాకేష్ ని ఓదార్చారు. జడ్జెస్ అయిన రోజా గారు అలాగే మనో గారు కూడా వెంకీ ఎందుకు ఎమోషనల్ అవుతున్నారో తెలియక షాక్ అయ్యి చూస్తున్నారు.

యాంకర్ అనసూయ కూడా ఏమీ అర్థం కాక అలాగే షాక్ లో ఉన్నారు. యూట్యూబ్‌లో కామెంట్స్ లో కూడా అసలు వెంకీ కి ఏమయింది ఎందుకు అంత బాధ పడుతున్నారు అని అందరూ కామెంట్ పెడుతున్నారుమనకి చూపించిన దాని ప్రకారం అయితే స్కిట్ లో ఏదో ఫీడ్ బ్యాక్ వల్ల వెంకీ బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తనకి అందాల్సిన అంత క్రెడిట్ అందట్లేదు అని వెంకీ మాటల ద్వారా అర్ధం అవుతోంది. అయితే ఎపిసోడ్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అందరూ కలిసి వెంకీతో ప్రాంక్ చేశారు. దాంతో తర్వాత అందరు మళ్లీ నవ్వేశారు.
watch video :
To watch the video, please click on “WATCH ON YOUTUBE”
టీం ఇండియా కు మరో అద్భుతమైన క్రికెటర్ దూరం అయ్యాడు. అతనెవరో కాదు.. ఢిల్లీ కి చెందిన ముప్పయ్యేళ్ల బ్యాట్స్ మెన్ మిలింద కుమార్. తాజాగా మిలింద కుమార్ ఇండియన్ జట్టుని వదిలి.. అమెరికా కు చెందిన మైనర్ లీగ్ క్రికెట్ టోర్నీ ని ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయమై మిలింద స్పందిస్తూ..” నేను ఇండియన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నా.. బీసీసీఐ అధికారులకు కూడా ఈ విషయమై ఇప్పటికే తెలియ చెప్పాను.. ఢిల్లీ జట్టు తరపున ఇషాంత్ శర్మ, విరాట్, శిఖర్ వంటి గొప్ప క్రికెటర్ల తో కలిసి ఆట ఆడటం అదృష్టం గా భావిస్తున్నా.. అయితే మరిన్ని అవకాశాల కోసమే జట్టుని వీడాల్సి వస్తోంది..” అంటూ పేర్కొన్నాడు.

భారత్ లో ఢిల్లీ, త్రిపుర, సిక్కిం జట్లతో మిలింద ఓ ఆట ఆడేసాడు. ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున కూడా ఆడి తన సత్తా చూపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా 85 బంతుల్లో గాను 78 పరుగులు చేసి అందరిని మెప్పించాడు.

అలాగే 2017 వ సంవత్సరం లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఒకే సీజన్ లో 121 యావరేజ్ ను మైంటైన్ చేస్తూ 8 మ్యాచ్‌లలో ఏకం గా 1331 పరుగులని చేసి రికార్డు సృష్టించాడు. 6 సిక్సర్లు, నాలుగు హాఫ్ సెంచరీలతో దూసుకెళ్లాడు. ప్రస్తుతం ఇండియన్ జట్టుకు దూరం కావడం క్రికెట్ ప్రియులను బాధపరిచే అంశమే.
రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ..అందరి ద్రుష్టిని ఆకర్షించే రాంగోపాల్ వర్మ. ఆయన ట్వీట్స్ కి, ఆయన ఇంటర్వూస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలిసిందే! ఇక మెగా ఫ్యామిలీ పైన, పవన్ కళ్యాణ్ రాజకీయాల పైన గతం లో ఎన్నో సార్లు స్పందించి. పవన్ ఫాన్స్ తో, మెగా ఫాన్స్ తో గొడవలు పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ.

mega-family
మరో సారి మెగా ఫ్యామిలీ పై ట్వీట్ అస్త్రం సంధించారు. ఆగష్టు 22 మెగా స్టార్ చిరంజీవి బర్త్‌డే రోజు అలాగే అదే రోజు రాఖీ పౌర్ణిమ కూడా ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ అంత చిరు ఇంట్లో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. చిరు ఇంట్లో పవన్ కళ్యాణ్, నాగ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, నిహారిక అందరు మీట్ అయ్యారు కానీ ఈ మెగా ఫ్యామిలీ మీట్ లో ఎక్కడ బన్నీ కనపడకపోయేసరికి అల్లు అర్జున్ ఫాన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేసారు.

అంతే కాదు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా రాలేదు. ఎందుకు రాలేకపోయారో కారణాలు తెలియకపోయినప్పటికీ ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ పలు ట్వీట్స్ వేసి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య కంఫ్యూజన్స్ తెచ్చారు. ఆ ట్వీట్ లో ఏముందంటే.. ‘బన్నీ నే రియల్ మెగా స్టార్ అంటూ కామెంట్స్ చేసాడు.. మెగా ఫామిలీ లో అందరికంటే కూడా అల్లు అర్జున్ నే ఎక్కువ సక్సెస్ అందుకున్నారు అంటూ ట్వీట్ చేసారు. మెగా ఫంక్షన్స్ కి అల్లు అర్జున్ అటెండ్ అవ్వకపోవడం ఆయన తెలివి తేటలకి నిదర్శనమని కొనియాడారు. ఇప్పుడు మీ ఫాన్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
The intelligence of @alluarjun is in not to attend @KChiruTweets celebrations is becos he is a self made star and shouldn’t join family parasites like @IAmVarunTej @IamSaiDharamTej @PawanKalyan @AlwaysRamCharan etc etc who just exist by sucking the success of MEGA @KChiruTweets
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2021
Real true Success is the Mega Success of a comedian Allu Ramalingiaah’s grandson @alluarjun against the sons ,nephews,nieces, uncles etc etc relatives of @KChiruTweets
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2021
