శ్రీకృష్ణుడి ఆలయం భారతదేశం లోనే ఎంతో పేరున్న గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాదీష్ ఆలయ శిఖరం పై ఉండే జెండా స్తంభానికి పిడిగిపాటు దెబ్బ ఎదురయ్యింది. కానీ ఆలయానికి చుట్టుప్రక్కన ప్రజలకి ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదు.
dwaraka-temple
ఒక విధానం గా పెను ప్రమాదే తప్పింది అనుకోవాలి మెరుపు దెబ్బకి కేవలం ఆలయం గోడలు మాత్రమే నల్లబడ్డాయి. ద్వారకాదీష్ ఆలయానికి గల జెండా కి ఎంతో పేరుంది ఈ జెండా 52 గజాలు ఉంటుంది.ఒక రోజులో 52 గజాల జెండాని మూడు సార్లు ఎత్తే ఆలయం ఇదే. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ద్వారకాధీష్ ఆలయానికి మునుపెన్నడూ ఇలాంటి పిడుగుపాట్లు పడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సుమారు 2200 సంవత్సరాల చరిత్ర ఉంది. జన్మాష్టమి రోజు లక్షల సంఖ్య లో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ద్వారకాధీశుడే ప్రస్తుతం పిడుగుపాటు నుంచి రక్షించాడు అనిఅక్కడ నివసిస్తున్న ప్రజలు, విశ్వసిస్తున్నారు.ఈ గుడి వజ్రనాబ్ నిర్మించారు.