పెళ్లిళ్లు స్వర్గం లో నిర్ణయించబడతాయంటారు.. కానీ.. వాటి తర్వాత వస్తున్న కష్టాలకి.. ఆ కష్టాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్న జీవితాలకు ఎవరు బాధ్యులన్న విషయం మాత్రం ఎవరు చెప్పరు. తాజాగా.. వరకట్న సమస్యలను ఎదుర్కోలేక మరో వివాహిత బలి అయింది. వేధింపులు భరించలేక ఆమె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణి ని శ్రీరాంపుర ఎస్బీఎం కాలనీకి చెందిన ప్రదీప్ కు ఇచ్చి వివాహం చేసారు. ప్రదీప్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

ఈ నెల మూడవ తేదీన ఆశారాణి ఆత్మహత్య చేసుకోగా.. ఆమె పుట్టింటివారు అత్తింటి వేధింపులే కారణమని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీనితో.. పోలీసులు ప్రదీప్ ను అరెస్ట్ చేసారు. కరోనా నేపధ్యం లో.. పోలీసులు ప్రదీప్ ను కైలాసపురం లోని టెంపరరీ జైలు లో ఉంచారు. అక్కడే.. బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ప్రదీప్ మరణించారు.










6)



















