మాస్క్ లాంటి పెయింట్ వేసుకుని మస్కా కొట్టింది..ఆ తరువాత ఏమి జరిగిందంటే..?

మాస్క్ లాంటి పెయింట్ వేసుకుని మస్కా కొట్టింది..ఆ తరువాత ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

కరోనా ఉద్ధృతం గా వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితిలో మాస్క్ ధరించడం అనేది మనల్ని రక్షించుకోవడం కోసమే అని విస్తృతం గా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో కూడా మాస్క్ ను ధరించాలన్న నిబంధనలను కఠినతరం చేసారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి ప్రబలుతోందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Video Advertisement

face mask paint

ఇది ఇలా ఉంటె.. కొందరు మాత్రం మాస్క్ ధరించడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ లు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తూ వారి ప్రాణాలతో పాటు.. ఇతరులను కూడా రిస్క్ లో పెడుతున్నారు. కొందరైతే.. అది తమ అందం కనబడకుండా చేస్తుందని భావించే వారు కూడా ఉన్నారు. అలాంటి ఇద్దరు యువతులు మాస్క్ వేసుకోకుండా.. పైన మాస్క్ లాంటి పెయింటింగ్ ను వేసుకున్నారు. ఇండోనేషియా లో, బాలి వద్ద ఈ ఘటన జరిగింది.

face mask

వారు వేసుకున్నది మాస్క్ కాదని, మాస్క్ లాంటి పెయింటింగ్ అని గుర్తించిన అధికారులు ఆ ఇద్దరు యువతుల పాస్ పోర్ట్ ను రద్దు చేసారు. ఈ ఇద్దరు యువతులు మాస్క్ వేసుకోకుండా.. నీలిరంగు సర్జికల్ మాస్క్ తరహా రంగును ముఖానికి వేసుకున్నారు. అక్కడితో ఆగకుండా.. వారు దీనిని వీడియో ను తీసి సోషల్ మీడియా లో పెట్టారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది వారు చేసిన పనిని చట్ట విరుద్ధం అని కామెంట్లు చేసారు. ఈ వీడియో అధికారుల దృష్టికి రావడం తో.. వారు ఆ యువతుల్ని గుర్తించి పాస్ పోర్ట్ లు రద్దు చేసారు.


End of Article

You may also like