ఆ ఊళ్ళో అసలు కరోనా నే లేదు.. కరోనా రాకుండా ఉండడానికి వారేమి చేశారంటే..?

ఆ ఊళ్ళో అసలు కరోనా నే లేదు.. కరోనా రాకుండా ఉండడానికి వారేమి చేశారంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం ఎటు వైపు చూసినా కరోనా గురించిన చర్చే.. మాయదారి రోగం.. దీని పీడా ఎప్పుడు విరగడ అవుతుందా..? అని అందరు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తం గా దాదాపు అన్ని పట్టణాల్లోనూ కరోనా విపరీతం ప్రబలుతోంది. అయితే.. కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ బెడద కొంత తక్కువ ఉంది.

Video Advertisement

cherlopalli village

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పరిధిలోని పుట్టపర్తి మండలం, చెర్లోపల్లి గ్రామస్తులు మాత్రం వారి ఊరిలోకి కరోనా రాకుండా జాగ్రత్త పడ్డారు. కరోనా మొదటి దశలోనూ.. రెండవ దశలో కూడా ఈ గ్రామం లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మొదలైనప్పటినుంచే.. ఈ గ్రామస్తులు ఊరు వదిలి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

cherlopalli 2

గ్రామం లో ఉన్న సచివాలయం లోనే వారి పనులు పూర్తి చేసుకునే వారు. గ్రామం నుంచి బయటకు రాకుండా.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ రావడం తో అక్కడ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ కార్యాలయాల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం తో.. వారు ఊళ్ళోనే ఉంటూ..తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు.


End of Article

You may also like