ఐదు శతాబ్దాలు, అంటే 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామ మందిరంలో రాముడు కొలువుతీరాడు. శ్రీరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు.
తెలుగు నుండి సినీ నటులు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ మాత్రం ఈ వేడుకలో హాజరు అయినట్టు కనిపించారు. తమిళ్ నుండి రజినీకాంత్ హాజరు అయ్యారు. హిందీ నుండి మాత్రం చాలా మంది ఈ వేడుకకి వెళ్లారు.
రాజకీయ ప్రముఖులతో పాటు హిందీ నటీనటులు అయిన రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, మాధురి దీక్షిత్, ఆయుష్మాన్ ఖురానా వంటి ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. వీరితో పాటు ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా ఇందులో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్య నగరాన్ని ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. లైట్లతో, పూలతో నగరాన్ని అలంకరించారు. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత హెలికాప్టర్ లో నుండి పూల వర్షం కూడా కురిసింది. అయితే అందరూ ఆనందంగా ఉన్నా కూడా, మరి కొంత మంది మాత్రం ఈ విషయంపై ఇంకొక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“రామాలయ ప్రారంభానికి ఇంత హడావిడి చేయడం అవసరమా?” అని అంటున్నారు. ఈ విషయంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గరికిపాటి నరసింహారావు గారు మాట్లాడారు. రాముడికి ఆర్భాటాలు అవసరమే అని, ఎందుకంటే ఆయన రాజు అని గరికిపాటి నరసింహారావు గారు చెప్పారు. “రాముడి గుడికి అంత హడావిడి ఆరాటం ఎందుకు అని కొంతమంది అంటున్నారు. మామూలుగా చేయొచ్చు కదా అని చెప్తున్నారు. కానీ అలా చేయకూడదు. శివుడికి, కృష్ణుడికి అంటే మామూలుగా చేయొచ్చు. కానీ రాముడు విషయంలో మాత్రం ఇలా కుదరదు. శివుడు త్యాగి, కృష్ణుడు యోగి. కానీ రాముడు భోగి”.
“అంటే ఆయన రాజు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వెళుతూ ఉంటే వెనకాల అధికారులు ముందు ఒక పది కారులు వెళుతూ ఉంటాయి. అలాంటిది ఒక మహారాజు వెళ్తే ఎలా ఉంటుంది? దానికి ఇలా ఆర్భాటం అని అంటే ఎలా?” అంటూ గరికిపాటి గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతే కాకుండా, “అయోధ్యలో ప్రతిష్టిస్తోంది బాల రాముడిని కానీ పెళ్లి కాని కానీ రాముడిని కాదు” అని అన్నారు. “ఆయన ఒక వీరత్వంతో నిలబడ్డారు. రాముడు అంటే ధనుష్కుడు. అలాంటి యోధుడు భారత యుగంలో అర్జునుడు” అని గరికిపాటి గారు చెప్పారు.
watch video :
ALSO READ : అయోధ్య రామ మందిరం చూసి దేశమంతా గర్విస్తుంటే…కొంతమంది తమిళ్ వాళ్ళు ఈర్షతో ఇలా చేస్తున్నారేంటి.?