కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచమంతా వణికిపోతున్నా సమయంలో వివాదాలకు కేంద్ర బిందువైన రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం కరోనా నువ్వు మమ్మల్ని చంపితే మాతోపాటు నువ్వు కూడా చస్తావు అని వార్నింగ్ ఇచ్చారు. డియర్ కరోనా నువ్వు చాలా తెలివైన దానిని అనుకుంటున్నావ్ ఏమో కానీ నువ్వు మమ్మల్ని చంపినప్పుడు మాతోపాటు నువ్వు కూడా చచ్చిపోతావ్ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు, నువ్వేమి స్వతంత్ర జీవి కాదు నువ్వు కూడా పారసైట్ వే నమ్మకం లేకపోతే వైరాలజీ క్రాస్ కోర్స్ తీసుకో సలహా ఇచ్చారు. నా రిక్వెస్ట్ ఏమనగా నువ్వు బ్రతుకు మమ్మల్ని అంటూ పోస్ట్ చేశారు.

అంతేకాక ఇప్పటివరకు మనం ఎన్నో రకాల చైనా వస్తువులని వాడాము చివరికి చావు కూడా చైనా దేనా అంటూ హాస్యంగా పోస్ట్ చేశారు. ఈయన చేసిన ట్విట్ లకు నెటిజన్లు సెటైర్ గా కరోనా వైరస్ కి ట్విట్టర్ అకౌంట్ లేదు కనుక మీరే డైరెక్టుగా ఆస్పత్రికి వెళ్లి కరోనా వైరస్ కి ఈ విషయాన్ని తెలియ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఆకాశమంత పందిరి, భూదేవంత పీట అనేవి కేవలం మాటల్లోనే ఉండేవి. కానీ నిజంగానే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట టైపులోనే ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి కార్డు దగ్గరనుండి అన్ని ఆడంబరమే. కేవలం ఒక పెళ్లి కార్డుకే లక్ష ఖర్చుపెట్టిన వాళ్లున్నారు. ఇక పెళ్లిల్లు కోట్లలో ఖర్చు. అలా కోట్లకు కోట్ల ఖర్చుతో సినిమాని తలపించే రేంజ్ లో జరిగినదే గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి. అయితే ఆ రికార్డ్ను బీట్ చేస్తున్నారట కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు. తన కూతురు రక్షిత పెళ్లికి ఇఫ్పటి వరకు ఎవరూ ఖర్చుపెట్టనంత ఖర్చుతో పెళ్లి చేస్తున్నారట. ఇంతకీ ఆ పెళ్లి ఖర్చెంతంటే అక్షరాల ఆరువందల కోట్లు . వరుడు ఎవరో కాదు హైదరాబాద్ కుర్రాడే, బంజారాహిల్స్కు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబంలో వ్యక్తి.













