ప్రేమని అంగీకరించకపోతే బతిమిలాడి ఒప్పించే రోజులు పోయాయి .ప్రేమ ఒప్పుకోకపోతే బెదిరించడం , భయపెట్టడం, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకపోతే తెగించి యాసిడ్ దాడులు చేయడం , ఇది ప్రస్తుతం సమాజంలో తీరు. తనకు దక్కనిది మరొకరు దక్కకూడదనే శాడిజం చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రభుద్దుడు మరికొంచెం ముందుకెళ్లి అక్క ప్రేమించలేదని , చెల్లిని వేధించడం స్టార్ట్ చేశాడు.

నిజాంపేటకు చెందిన కోట్ల మాధవ్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసాడు . సిటీలోని ఓ కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం ఒక అమ్మాయితో మాధవ్ కి పరిచయం అయింది . తనతో స్నేహంగా ఉంటున్న అమ్మాయికి ప్రేమిస్తున్నా అని తన ప్రేమను బయటపెట్టాడు. నీ పట్ల నాకు అలాంటి అభిప్రాయం లేదని సూటిగా చెప్పడంతో ఇగో హర్టయి తనపై కక్ష పెంచుకున్నాడు . తనని బాధపెట్టడం కంటే తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలిని ఏడిపిస్తే తన కోపం తగ్గుతుందని, ఆ యువతి చెల్లెలి ఫోన్ నంబర్ ని సేకరించాడు.

ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసి ,ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లింక్ చేసుకున్నాడు. ఆ నంబర్‌తో వాట్సాప్ లో యువతి చెల్లికి అసభ్యకర మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు. కొత్త నంబర్ నుండి వస్తున్న మెసేజ్‌లతో విసిగిపోయిన బాధితురాలు మొదట ఏదో పొరబాటున వస్తున్నాయనుకుంది. కానీ మాధవ్ వేధింపులు ఎక్కువవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.

టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి మాధవ్ గా తేల్చి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వేధిస్తూకాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటిని అవాయిడ్ చేసి పోలీసులకు కంప్లయింట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

ఇదేం సాడిజం రా బాబూ . నిజంగా నీలో తనకు నచ్చే లక్షణాలుంటే ఏ అమ్మాయైనా ఎందుకు యాక్సెప్ట్ చేయదు . ఇలాంటి పనుల వల్ల ఏం సాధిస్తున్నార్రా? కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి రా, ప్రేమించకపోతే మరి కొంచెం ప్రేమను పంచడానికి ట్రై చేయండి అంతేకాని మృగాళ్ల మారకండి, ఏమంటారు ఫ్రెండ్స్..













ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను దొరబాబు భార్య నదిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంత మంచి భార్య కూతుర్ని పెట్టుకొని అదేం పాడు పని అని దొరబాబు పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. గతం లో ఇలా చేసాడని తెలుసు కానీ పెళ్లయ్యాక కూడా ఏంటో?




తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది సారా అలీ ఖాన్. ఆ ఫోటో ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ ఫోటోలు దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు చర్చనీయాంశం . వీటిపైన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ఫైర్ అవుతుంటే. మరికొందరు మాత్రం సినిమా వాళ్ళకి ఇవన్నీ కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన కేదార్నాథ్, సింబా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్. 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. ఇక 2020 లో రెండు సినిమాలతో ముందుకి రానుంది.ఒకటి కూలీ నంబర్ 1. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి ఇలాంటి ఫోటోలు ఆమె సినిమాలపై ఏం ప్రభావం చూపించావు కదా?

తర్వాత చాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి



