ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మీరు చదివింది నిజమే . నేను తప్పిపోయాను నన్ను నా యజమాని దగ్గరకు చేర్చండి అంటూ పోలీసులకు వేడుకుంది. కుక్కేంటీ? పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయటమేంటి?అదేమన్నా మాట్లాడుతుందా? చదువుతున్నాం కదా అని ఏది పడితే అది రాసేయకండి . నిజమండీ కుక్క మాట్లాడలేదు , మేం కూడా ఒప్పుకుంటాం . కానీ పూర్తిగా చదివాక వావ్ అంటూ మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలింతకీ ఏం జరిగిందో తెలుసా?

అమెరికాలో టెక్సస్ లోని ఓ పోలీస్ స్టేషన్ కి అర్థరాత్రి ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వచ్చింది. రయ్ మంటూ స్టేషన్ లోకి దూసుకొచ్చిన కుక్కను చూసిన పోలీసులు ,బయటికి గెంటేయడానికి ప్రయత్నించారు. కానీ అది అక్కడనుండి కదలకుండా పోలీసుల వైపు చూస్తూ ఏవేవో సైగలు చేసింది. అలా చాలాసేపు చేసింది. ఆ సైగలకు అర్థం ఏమిటో మొదట వారికి ఏమాత్రం అర్థం కాలేదు . కానీ కుక్క ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని మాత్రం అర్దమైంది. ఆ సైగలను అర్దం చేస్కోవడానికి ప్రయత్నించారు, చివరకు అర్దం చేసుకున్నాక ఆశ్చర్యపోయారు .

ఫైనల్ గా ఆ సైగల్ సారాంశం ఏంటంటే “తాను తప్పిపోయాను.. తనకు దారి తెలియడం లేదు, యజమానికి తనను అప్పగించండి, ప్లీజ్” అని. ఇదంతా పోలీసులకు అర్దం అయ్యేలా చెప్పగలిగింది . అది అర్థం చేసుకున్న పోలీసులు కుక్క ప్రవర్తనకు ఫిదా అయిపోయారు. రాత్రంతా దానిని తమ దగ్గరే ఉంచుకుని దానితో ఆడుకున్నారు. కుక్క కూడా పోలీసులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్లతో కలిసిపోయింది.

కుక్కలు చాలా తెలివిగలవి..అందులోని జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలకు తెలివి కాస్త ఎక్కువే. కుక్క తెలివికి ఫిదా అయిన పోలీసులు దానిని ఎలాగైనా యజమాని దగ్గరకి చేర్చాలనుకున్నారు . కానీ కుక్క మెడలో ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో పోలీసులకు కష్టం అనిపించింది. అప్పుడు ఇక్కడ నేనున్నానంటూ వారికి గుర్తొచ్చింది అదేనండీ “సోషల్ మీడియా” . కుక్కను ఫొటొలు తీశారు, పోస్టు చేశారు . ఈ విషయం కాస్తా వైరలై, చివరికి యజమాని వరకు వెళ్లింది.
రాత్రి నిద్రపోయినప్పుడు కుక్క బయటకు వెళ్లిపోయిందనీ , దారితప్పి పోయినప్పటికి పోలీసులని ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందని, తన కుక్క తెలివికి మురిసిపోయాడు ఆ యజమాని . ఇంత మందిని ఆశ్చర్యపరిచి, అందరిని ఫిదా చేసిన ఆ కుక్క పేరు “చికో”.

చిరు152 వ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటన్నారు .ఈ సినిమాలో చిరు ఓ కమ్యునిస్ట్ గా కనిపించబోతున్నట్టు ఇటీవల లీక్ అయిన ఓ పిక్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్ర ఓ లెక్చరర్ అని , అసలు లెక్చరర్ గా ఉన్న ‘ఆచార్య’ నక్సలైట్ గోవింద గా ఎలా మారడానికి దారి తీసిన పరిస్ధితులు ఏంటి.. అన్నది అసలైన కథ . లెక్చరర్ ఆచార్య పాత్ర గురించే ఇప్పుడు డిస్కషన్ .











ప్రస్తుతం చాలా మంది సినిమాలను థియేటర్ కి వెళ్లకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు చూస్తున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకే అందులో రావడంతో థియేటర్స్ పై ఎక్కువ మక్కువ చూపించట్లేదు. విదేశాల్లో అయితే ఇది మరి ఎక్కువ.
అయితే అలా వైకుంఠపురంలో సినిమాకి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో లభించదు తెలిసి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూసారు. పాజిటివ్ టాక్ రావడంతో అందరు థియేటర్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు ఇలా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరు ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.













