జరుగుతున్నది ముఖ్యమంత్రి కార్యక్రమం .. పెద్ద సభ ,వందల సంఖ్యలో జనాలు కోలాహలం , భారీ బందోబస్త్ అంతమంది మధ్య మీడియాని ఆకట్టుకున్నది ఒక వ్యక్తి . అది కూడా మహిళ . ఇంతకీ అంత ప్రత్యేకత ఏంటి అంటే తను తన నెలల చంటిబిడ్డని ఎత్తుకోవడమే . పిల్లల్ని ఎత్తుకోవడంలో విశేషమేముంది . పిల్లలని ఎత్తుకోవడంలో విశేషం లేదు కానీ ఎత్తుకుని విధులకి హాజరు కావడంలోనే విశేషం ఉంది .

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు . రెండు రోజుల పర్యటనలో భాగంగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ పాల్గొన్నారు . ముఖ్యమంత్రి కార్యక్రమం కావడంతో భారిగా బంధోబస్త్ ఏర్పాటు చేశారు . అక్కడ విధుల్లో పాల్గొన్నది కానిస్టేబుల్ ప్రీతీరాణి . చంటిబిడ్డని తీసుకుని విధులకు హాజరు కావడంతో అందరి దృష్టి అటు మళ్లింది .

భర్తకి ఆ రోజు పరీక్ష ఉండడంతో బిడ్డని చూసుకోవడం ప్రీతి వంతయింది . దాంతో బిడ్డని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం , మరోవైపు ఉద్యోగం ముఖ్యం కావడంతో రెండింటిని వదులుకోలేక కూతురితోనే విధులకి హాజరయింది . గ్రేటర్ నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది ప్రీతిరాణి . ముఖ్యమంత్రి కార్యక్రమం అవ్వడంతో ఉదయం ఆరుగంటలకే వివిఐపి భద్రత కార్యక్రమాలని అప్పచెప్పారు . దాంతో బిడ్డని తీసుకుని ఉదయం ఆరుగంటలకే డ్యూటికి వచ్చారు . చంటి బిడ్డనెత్తుకుని డ్యూటిలో పాల్గొన్న ప్రీతి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

నేడు పెరుగుతున్న అవసరాల రిత్యా భార్య , భర్త ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి . దాంతో పిల్లల్ని చూసుకోవడం కూడా ఆలుమగల ఇద్దరి వంతవుతుంది . ఉద్యోగం చేస్తున్న కుటుంబ ఆదాయం పెంచడంలో భాగస్వామ్యం అవుతున్నప్పటికి, చాలావరకు తల్లులే పిల్లల సంరక్షణ తీస్కోవాల్సి వస్తుంది .









పక్కింటోడు, పక్కింటి భార్య, లైన్లు వేయడం, అక్రమ సంబంధాలు, లేచిపోవడాలు మీదే స్కిట్ వేసుకుని కామెడీ పాందిచినప్పుడే ఆ ఛానల్ స్థాయి దిగజారిపోయింది. ఇక ఇలాంటివి బయటకి వచ్చినప్పుడు ఆ షో రేంజ్ తగ్గుతుంది అంటారా? లేకపొతే ఇవన్నీ సహజమే…మనం కామెడీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ గురువారం రాత్రి తొమ్మిదిన్నర ఎప్పుడు అవుతుందా అనుకుంటూ ఎదురు చూడటం బెటర్ అనుకుంటారా ఆడియన్స్.








ఆకాశమంత పందిరి, భూదేవంత పీట అనేవి కేవలం మాటల్లోనే ఉండేవి. కానీ నిజంగానే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట టైపులోనే ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి కార్డు దగ్గరనుండి అన్ని ఆడంబరమే. కేవలం ఒక పెళ్లి కార్డుకే లక్ష ఖర్చుపెట్టిన వాళ్లున్నారు. ఇక పెళ్లిల్లు కోట్లలో ఖర్చు. అలా కోట్లకు కోట్ల ఖర్చుతో సినిమాని తలపించే రేంజ్ లో జరిగినదే గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి. అయితే ఆ రికార్డ్‌ను బీట్ చేస్తున్నారట కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు. తన కూతురు రక్షిత పెళ్లికి ఇఫ్పటి వరకు ఎవరూ ఖర్చుపెట్టనంత ఖర్చుతో పెళ్లి చేస్తున్నారట. ఇంతకీ ఆ పెళ్లి ఖర్చెంతంటే అక్షరాల ఆరువందల కోట్లు . వరుడు ఎవరో కాదు హైదరాబాద్ కుర్రాడే, బంజారాహిల్స్‌కు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబంలో వ్యక్తి.




