బ్రెజిల్లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో ఆమె భర్త వేదికనెక్కి హల్చల్ చేశాడు. విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. దీంతో ఆ కిరీటం ముక్కలు ముక్కలుగా మారింది. బ్రెజిల్లో గత శనివారం (27) జరిగిన మిస్ గే మాటో గ్రోస్సో 2023 అందాల పోటీలో ఈ సంఘటన జరిగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
బ్రెజిల్ లో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలా మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.. రౌండ్ల వారీగా జల్లెడ పట్టగా చివరికి నాథల్లీ బెకర్, ఇమాన్యుయెల్లీ బెలిని ఇద్దరు ఫైనలిస్టులుగా నిలిచారు. వారిలో ఒకరి విజేతగా ప్రకటించేందుకు ఒక మహిళ కిరీటంతో వచ్చింది. ప్రేక్షకులు అరుపులతో వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇదే క్రమంలో ఇమాన్యుయెల్లీ బెలిని జడ్జిలు విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని తొడిగేందుకు సిద్ధమయ్యారు.

అయితే రన్నరప్ నాథల్లీ బెకర్ భర్త హఠాత్తుగా వేదిక పైకి వచ్చి కిరీటాన్ని లాక్కొన్నాడు. దానిని నేలకేసి కొట్టి నానా రచ్చ చేశాడు. అక్కడున్న వారిపై కోపంతో అరుస్తూ హడావుడి సృష్టించాడు. తన భార్య విజేత కాలేదనే కోపంతో గందరగోళం చేసాడు. ఈ అనూహ్య ఘటనకు అందరూ షాక్‌కు గురయ్యారు. అనంతరం భార్య నాథల్లీ బెకర్‌ను చేయిపట్టుకుని లాక్కెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరోసారి కిరీటాన్ని నేలకేసి కొట్టి ముక్కలు చేసాడు సదరు వ్యక్తి. అక్కడున్నవారు వారించినా వినలేదు.

వెంటనే ఈవెంట్ నిర్వాహకులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని స్టేజ్ నుంచి కిందికి పంపేశారు. అతనితో పాటు అతని భార్యను కూడా వెళ్ళిపోయింది. ‘మిస్ నాథల్లీ బెకర్ రెండో స్థానంలో నిలవడం న్యాయబద్దమైనదిగా ఆమె భర్త భావించలేదు. అందుకే ఆ విధంగా ప్రవర్తించారు . అతని చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ పేజెంట్ కోఆర్డినేటర్ మలోన్ హేనిష్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
watch video:



వికారం, ఉబ్బరం, అజీర్తి, డయేరియా, వాంతులు, కడుపునొప్పి, స్కిన్ రాషెస్, ఆకలి లేకపోవడం


గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌లో నివసిస్తున్న హీరాబెన్ తన ముగ్గురు కుమార్తెలతో పాటు జీవించేది. తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకునేది. ఆమెకు బీపీ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చి కన్ను మూసింది. దాంతో ఆ ముగ్గురు సోదరీమణులు తల్లి లేని వారు అయ్యారు. తల్లి మరణించిన 6 నెలల వరకు ఆమె ఆలోచనలతోనే గడిపారు. అప్పుడు వారికి తల్లి తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆమె విగ్రహాన్ని అయితే తీసుకురావచ్చని, 6 అడుగుల ఎత్తైన తల్లి విగ్రహాన్ని తేరు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
హీరాబెన్ తన జీవితాంతం వరకు తన కుమార్తెలకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంది. తమ తల్లి విగ్రహానికి రోజూ హారతి ఇస్తారు. తమ కళ్ళ ముందు అమ్మ ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరీమణులు తమ తల్లి లేదని బాధపడటం లేదు. విగ్రహంలోనే తమ తల్లిని చూసుకుంటున్నారు.
రోజూ విగ్రహాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ తల్లి లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఈ అక్కచెల్లెల్లు. అలాగే ఆమె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించి, దాని ద్వారా పలువురికి సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం, చదువు లేనిపిల్లలకు వారి చదువు కోసం సహాయం చేస్తున్నారు.









ఆసిఫాబాద్ జిల్లాలోని రిబ్బెన మండలంలోని తుంగెడకు చెందిన మనోహర్, విస్తారిల కుమారుడు డోంగ్రి రేవయ్య. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తల్లి విస్తారి గవర్నమెంట్ స్కూల్ లో వంట మనిషిగా పని చేస్తుంది. ఇక రేవయ్య చదువు చిన్నతనం నుండి గవర్నమెంట్ స్కూల్ లోనే కొనసాగింది. కాగజ్ నగర్ శిశుమందిర్‌లో 5వ తరగతి వరకు, ఆ తరువాత టెన్త్ క్లాస్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లో చదువుకున్నాడు. ఆ తర్వాత రేవయ్య హైదరాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజ్ లో ఇంటర్ చేశాడు.
మద్రాస్ ఐఐటీ కాలేజ్ లో బీటెక్ చేసి, ప్రైవేట్ కంపెనీలో జాబ్ సాధించాడు. అయితే రేవయ్యకు ఆ జాబ్ లో సంతృప్తి కలగలేదు. దాంతో జాబ్ చేస్తూ, సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. జాబ్ వల్ల సరిగా ప్రిపేరు అవట్లేదని రేవయ్య జాబ్ ను వదిలి పూర్తిగా ప్రిపరేషన్ పై పోకస్ చేశాడు. అందుకు తల్లి కూడా మద్దతు తెలిపి, ఫ్యామిలీ పోషణ అంతా విస్తారి చూసుకుంది.
తాను ఉద్యోగం మానేయడం వల్ల తల్లి పని చేస్తూ, కష్టపడటం చూసి బాధ కలిగినా, తన లక్ష్యం కోసం బాగా చదివి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాదించాడు. తాజాగా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో రేవయ్యకు 410వ ర్యాంక్ వచ్చింది. ఆలిండియా ర్యాంక్ సాదించిన రేవయ్యను ప్రశంసిస్తున్నారు.

































తన వదిన విషయంలో ఒక మరిది చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజెన్లు అతనిపై ప్రశంసలను కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ మరిది ఏం చేశాడంటే అతను తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. షాక్ అయ్యారా? అదేంటి వదినను పెళ్లి చేసుకోవడం తప్పు. అతన్ని మెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ మహిళ భర్త మరణించడంతో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకోవాలని మారిది అనుకున్నాడు
ఈ క్రమంలోనే తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. శంబాజీకి భార్య, ఎనిమిది నెలల కొడుకు, ఇద్దరు కవలల ఉన్నారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వదినను, అన్న పిల్లలను చూసి బాధపడిన శంబాజీ తమ్ముడు రాహుల్ వినోద్ ఒంటరిగా బ్రతుకుతున్న వదినకు తోడు ఉండడానికి, తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకోవడానికి అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్లనే అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.