వారిద్దరికీ పెళ్లి అయ్యి ఏడాదే అయ్యింది. మూడు ముళ్లతో ముడిపడి.. అందరికీ దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరిగా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వీరిని చూసి విధికి కన్నుకుట్టింది అనుకుంటా..భర్తను హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. అది తట్టుకోలేక తనువు చాలించింది భార్య..ఈ గుండెలు పిండేస్తున్న ఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేటలో జరిగింది.
హైదరాబాద్ అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. ఇద్దరూ డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు ఈ నెల 2వ తేదీన సాహితి హైదరాబాద్ వచ్చింది. ఆమె హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అమెరికాలో ఉన్న మనోజ్‌కు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

భర్త మరణవార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ నెల 23న మనోజ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం మనోజ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత సాహితిని అంబర్‌పేటలోని పుట్టింటికి తీసుకెళ్లారు. మనోజ్ అంత్యక్రియలు తర్వాత సాహితి ఇంకా కుమిలిపోయింది. సాహితి బాధను చూసి ఆమె చెల్లెలు అక్కను క్షణం కూడా వదలకుండా పట్టుకోనే ఉంది. రాత్రి కూడా అక్కను అంటిపెట్టుకోనే పడుకుంది.

అయితే గురువారం ఉదయం తొమ్మిదిన్నర సమయంలో.. సాహితి చెల్లెలు వాష్‌రూమ్‌కని అక్కను విడిచి బయటకు వెళ్లింది. అమె బయటకు వెళ్లి వచ్చేటప్పటికి గదికి లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అక్కను ఎంత పిలిచినా పలకలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే.. చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతోంది సాహితి.

చెల్లి బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే సాహితి ఈ కఠిన నిర్ణయం తీసుకోవటం కుటుంబసభ్యులను కలచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిలోనే.. రోజుల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు ఇలా చనిపోవటం పట్ల బంధువులంతా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!





ఆసిఫాబాద్ జిల్లాలోని రిబ్బెన మండలంలోని తుంగెడకు చెందిన మనోహర్, విస్తారిల కుమారుడు డోంగ్రి రేవయ్య. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తల్లి విస్తారి గవర్నమెంట్ స్కూల్ లో వంట మనిషిగా పని చేస్తుంది. ఇక రేవయ్య చదువు చిన్నతనం నుండి గవర్నమెంట్ స్కూల్ లోనే కొనసాగింది. కాగజ్ నగర్ శిశుమందిర్‌లో 5వ తరగతి వరకు, ఆ తరువాత టెన్త్ క్లాస్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లో చదువుకున్నాడు. ఆ తర్వాత రేవయ్య హైదరాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజ్ లో ఇంటర్ చేశాడు.
మద్రాస్ ఐఐటీ కాలేజ్ లో బీటెక్ చేసి, ప్రైవేట్ కంపెనీలో జాబ్ సాధించాడు. అయితే రేవయ్యకు ఆ జాబ్ లో సంతృప్తి కలగలేదు. దాంతో జాబ్ చేస్తూ, సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. జాబ్ వల్ల సరిగా ప్రిపేరు అవట్లేదని రేవయ్య జాబ్ ను వదిలి పూర్తిగా ప్రిపరేషన్ పై పోకస్ చేశాడు. అందుకు తల్లి కూడా మద్దతు తెలిపి, ఫ్యామిలీ పోషణ అంతా విస్తారి చూసుకుంది.
తాను ఉద్యోగం మానేయడం వల్ల తల్లి పని చేస్తూ, కష్టపడటం చూసి బాధ కలిగినా, తన లక్ష్యం కోసం బాగా చదివి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాదించాడు. తాజాగా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో రేవయ్యకు 410వ ర్యాంక్ వచ్చింది. ఆలిండియా ర్యాంక్ సాదించిన రేవయ్యను ప్రశంసిస్తున్నారు.

































తన వదిన విషయంలో ఒక మరిది చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజెన్లు అతనిపై ప్రశంసలను కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ మరిది ఏం చేశాడంటే అతను తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. షాక్ అయ్యారా? అదేంటి వదినను పెళ్లి చేసుకోవడం తప్పు. అతన్ని మెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ మహిళ భర్త మరణించడంతో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకోవాలని మారిది అనుకున్నాడు
ఈ క్రమంలోనే తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. శంబాజీకి భార్య, ఎనిమిది నెలల కొడుకు, ఇద్దరు కవలల ఉన్నారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వదినను, అన్న పిల్లలను చూసి బాధపడిన శంబాజీ తమ్ముడు రాహుల్ వినోద్ ఒంటరిగా బ్రతుకుతున్న వదినకు తోడు ఉండడానికి, తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకోవడానికి అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్లనే అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.










