మీరు మీ ఇంటి సభ్యులను అనేక వ్యాధుల నుంచి రక్షించాలనుకుంటే, మీ ఇంటిని శుభ్రంగా ఉంచడం ముఖ్యం. దీనికి ఫ్లోర్ క్లీనర్ లు సహాయపడతాయి, ఇవి సాధారణ ఫినైల్ కంటే 10 రెట్లు ఎక్కువ పరిశుభ్రతను అందిస్తాయి.
జెర్మ్స్ నుంచి రక్షణను అందిస్తాయి. బాత్రూమ్, కిచెన్ ఫ్లోర్, సింక్, టైల్, కిచెన్ కౌంటర్ టాప్ మొదలైన వాటిని శుభ్రంగా ఉంచుతాయి.ఈ ఫ్లోర్ క్లీనర్ లు గచ్చు మీద పడిన కాఫీ, కెచప్, సాస్ వంటి కఠినమైన మరకలను కూడా పూర్తిగా తొలగిస్తాయి.

ఇలా ఫ్లోర్ క్లీనర్లకి సంబంధించిన అనేక ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటి యాడ్స్ కూడా మనం చూస్తాం. అయితే ఈ యాడ్స్ అన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. మనం దాన్ని గుర్తించి ఉంటాం. అదేంటంటే.. అన్ని క్లీనర్లు 99 .99 % శాతం క్రిములని తొలగిస్తాయి అని చెప్తారు.

“అదేంటి? ఎందుకు 100 % శాతం క్రిములని చంపదు?” అని మనం ఆలోచించము. ఒకవేళ వంద శాతం క్రిములని సంహరిస్తుంది అని ఉత్పత్తిదారులు హామీ ఇస్తే వినియోగదారులకు ఎటువంటి రోగాలు రావు అని ఒప్పుకున్నట్టే.. అందుకే అటువంటి హామీ ఇవ్వరు. అలాగే అన్ని రకాల ఫ్లోర్ క్లీనర్లు ఒకేలా ఉంటాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒక్కొక్క రకం వేర్వేరు రసాయనాలను కలిగి ఉంటుంది.

ఒక ఫ్లోర్ మీద జెర్మ్స్ లేకపోవడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. కానీ EPA-నమోదిత రసాయన స్టెరిలెంట్లు మాత్రమే అన్ని రకాల వ్యాధికారక క్రిములను చంపగలవు. అందుకే ఒక ఫ్లోర్ క్లీనర్ ని కొనేప్పుడు వెనకాల రాసి ఉండే వివరాలను కూడా చదవాలి. అలాగే వాటిని కొనేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
# ఫ్లోర్ క్లీనర్ ని కొనేప్పుడు థర్డ్-పార్టీ సర్టిఫికేషన్ల కోసం చూడాలి.
# అలాగే ఏ అవసరం కోసం క్లీనర్స్ ని కొంటున్నారా వాటికి సరిపడే రకాలను మాత్రమే కొనాలి. ఒ
# కటి కంటే ఎక్కువ పనుల కోసం తయారు చేసే ఉత్పత్తులు పలుచగా ఉండి.. తక్కువ ప్రభావం చూపుతాయి.

వివాహం చేసుకునే యువతుల మొదటి ఛాయిస్ కూడా ఇటువంటి అబ్బాయిలే. అమ్మాయిలే కాకుండా వారి తల్లి దండ్రులు తమ కుమార్తెలకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిల సంబంధం వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ తండ్రి మాత్రం బీటెక్ చదివిన అమ్మాయిని పాప్ కార్న్ బండి నడిపే కుర్రాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉన్నప్పటికి ఇది వాస్తవం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజమండ్రికి చెందిన సుధీర్ అనే యువకుడు నగరంలోని గాంధీ పార్కుకి వెళ్ళే రోడ్డు పక్కనే పాప్ కార్న్ బండి నడుపుతూ ఫ్యామిలిని పోషిస్తున్నాడు. పాప్ కార్న్‌తో మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్‌ను కూడా బండి పై అమ్ముతుంటాడు. ఆ బండి వద్ద దొరికేవి రుచిగా ఉండటంతో ఎప్పుడూ కస్టమర్లతో ఆ బండి దగ్గర రద్దీగా ఉంటుంది. అయితే సుధీర్ బీటెక్ ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని అంటే నమ్మి 10 లక్షలు అప్పు తెచ్చి కట్టాడు.
ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న సుధీర్ చేసిన అప్పులు తీర్చాలని, తన ఫ్యామిలిని కూడా పోషించాలని అనుకున్నాడు. అలా పాప్ కార్న్ బండి పెట్టుకుని 7-8 ఏళ్లగా నడుపుతూ సగం అప్పులను తీర్చాడు. ప్రస్తుతం అతని బిజినెస్ సాగుతోంది. కుటుంబ పోషణలోను ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు పెరుగుతోందని సుధీర్ కి పెళ్లి చేశారు. పాప్ కార్న్ బండి నడిపేవాడికి పిల్లనిస్తారా అనుకున్నారు. అయితే సుధీర్ కి బీటెక్ చదివిన యువతితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిపించింది ఆ అమ్మయి తండ్రే కావడం విశేషం.
అమ్మయి పెళ్లి చేసుకోవడానికి సందేహించిన కుమార్తెను ఒప్పించి మరి పెళ్లి చేశాడు ఆ తండ్రి. జాబ్ చేసేవాడి కంటే కష్టపడి పనిచేసేవాడే బాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయితో నీ లైఫ్ బాగుంటుందమ్మా’ అని ఆ తండ్రి కూతురిని ఒప్పించాడు. ఆ అమ్మాయి తండ్రి డిగ్రీ పూర్తి చేశారంట. కొంత కాలం జాబ్ కోసం ప్రయత్నించి, జాబ్ రాకపోవడంతో ఆటో నడపటం ప్రారంభించాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్న సుధీర్ ఆఖరికి పాప్ కార్న్ బండి పెట్టుకొని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులు తీరిన తరువాత తన బిజినెస్ ను పెంచుకునే ఆలోచనలో సుధీర్ ఉన్నాడు.













1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:




జాబ్ చేస్తూ చదువుకుంటూ, ఇప్పుడిప్పుడే తన ఫ్యామిలికి అండగా ఉంటున్నాడు. అతను ఇపుడు చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇంకో 10 రోజుల్లో సాయేశ్ ఎమ్మెస్ పూర్తి అవబోతుంది. ఈనేపథ్యంలో అతను ఇంటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ బుధవారం అర్దరాత్రి 12.50 గంటలకు గ్యాస్ స్టేషన్లో అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాయేశ్ పై కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన సాయేశ్ ను సిబ్బంది ఓస్థానిక ఆసుపత్రికి తరలించారు.
సాయేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశాడు. త్వరలోనే ఇంటికి వస్తా అని చెప్పిన సాయేశ్, అంతలోనే కన్నుమూయడంతో ఆ ఫ్యామిలిలో విషాదం నెలకొన్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరా సాయేశ్ హెచ్-1బీ వీసాను కూడా తీసుకున్నాడు. అతను అందరితో చాలా కలివిడిగా ఉండేవాడని, ఎవరైనా అడిగితే లేదనకుండా సాయం చేసేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. కాగా పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
అతని స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం సాయేశ్ మృతదేహాన్ని ఇండియాకి పంపుతున్నామని, దాని కోసం ఆర్ధిక సహాయం అవసరం అని చెప్పారు. డబ్బును సేకరించడం కోసం వారు GoFundMe ని క్రియేట్ చేశారు. వారు మాట్లాడుతూ ”డబ్బు సాయేశ్ ని తిరిగి తీసుకురాదని, కానీ అతని కుటుంబం కోసం మేము చేయగలిగేది ఇదే ” అని తెలిపారు.



దర్శి గ్రామంలో పిఆర్ డిపార్ట్మెంట్ లో సూరె వెంకటరామిరెడ్డి సీనియర్ సహాయకుడిగా పని చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్య బారిన పడడంతో, వైద్య పరీక్షలు చేయగా కాలేయ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స చేయించుకోవడం కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేరారు. అక్కడ వైద్యులు టెస్ట్ చేసి, తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని వెంకటరామిరెడ్డి ఫ్యామిలీకి చెప్పారు.
వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి ఆ వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వైద్యులు కాలేయ మార్పిడి గురించి చెప్పగానే తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికి ఆమె ముందుకొచ్చింది. దాని కోసం భర్త ప్రకాశ్ రెడ్డిని కూడా ఒప్పించింది.
హర్షిత కోరిక మేరకు, ప్రకాశ్ రెడ్డి కూడా కాలేయ మార్పిడికి ఒప్పుకున్నాడు. దాంతో హర్షిత వెంకటరామిరెడ్డికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చింది. కాలేయ మార్పిడిని డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో వెంకటరామిరెడ్డి ఆరోగ్యవంతుడిగా మారారు. తన తండ్రిని కాపాడడం కోసం కాలేయ దానం చేసిన హర్షిత పై ప్రశంసలు, అభినదనలు వెల్లువెత్తాయి.