ఒక జీవికి కలలు రావటమనేది సహజం. అయితే ఇందులో కొన్ని కలలు మనకు గుర్తు ఉంటాయి. కొన్ని మనకు గుర్తు ఉండవు. కొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. ఒక్కొక్కసారి మనం ఎప్పుడో ఒకసారి చూసిన మనుషులు కూడా మన కలలోకి వస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనకు పీడ కలలు వస్తే, కొన్నిసార్లు మంచి కలలు వస్తాయి. అయితే అసలు కలలు రావడం వెనక కారణం ఏంటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.
తెలిసినా కూడా ఇలా కలలు రావడానికి రెండు, మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సైన్స్ ప్రకారం గుర్తించిన కారణం. అదేంటంటే. ఒక మనిషి ఆ రోజులో ఎదుర్కొన్న సంఘటనలు, ఎక్కువగా ఆలోచించిన ఆలోచనలు కలల రూపంలో వస్తాయట. కొంత మంది కలల ద్వారా భవిష్యత్తు చూడగలుగుతారు. ఒక మనిషి సున్నిత మనస్కులు అయితే, లేదా ప్రతి చిన్న విషయానికి భయపడేవారు అయితే వారికి పీడకలలు, లేదా భయంకరమైన కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అయితే ఇందాక పైన చెప్పినట్టుగా ఒక మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటే, అలాగే వారు ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పరిస్థితులని బాగా గమనించి భవిష్యత్తు గురించి అంచనా వేసుకునే వారు అయితే, ఆ మనిషి తనకి భవిష్యత్తులో జరగబోయే వాటిని చూడగలుగుతారు. ఒక్కొక్కసారి మనకి ఏదో పెద్ద కొండపై నుంచి పడిపోతున్నట్టు లేదా కాలుజారి ఎక్కడో కింద పడిపోతున్నట్టు కలలు వస్తాయి.
మనం అప్పుడు ఉలిక్కిపడి లేస్తాం. అంటే మనం ఆ కలలకు స్పందిస్తున్నట్టు అర్థం. ఈ కలలు అన్నిటిని మనం మనో నేత్రంతో చూడగలుగుతాము. అయితే, యోగ శాస్త్రం ప్రకారం కలలు రావడానికి ఇంకొక కారణం ఉంది. ఈ కలలు అనేవి మనిషి శరీరంలో చక్రాలపై ఆధారపడి ఉంటాయి. కలల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
watch video :