విమానం ఎక్కడం అంటే అందరికి సరదాగానే ఉంటుంది. కానీ.. కొంతమందికి మాత్రం టేకాఫ్ అయ్యే సమయం లోను, ల్యాండ్ అయ్యే సమయం లోను భయం గా ఉంటుంది. ఎందుకంటే.. ఈ రెండు సమయాల్లోనూ ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే.. ఈ రెండు సమయాల్లోనూ తప్పని సరిగా విండో షట్టర్లను తెరచి ఉంచాలని చెబుతుంటారు.
అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టే బయట పరిస్థితి ఎలా ఉందొ గమనించాలి. విండో షట్టర్లు తెరిచి ఉంచడం వలన టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, లాండింగ్ అవుతున్నప్పుడు విమానం లో కూర్చున్న వారి దృష్టి ఆటోమేటిక్ గా విమానం బయట వైపుకు పడుతుంది. దానివలన బయట కాంతి కి అలవాటు పడి కొంత భయం తగ్గుతుంది. అలాగే.. విమాన సహాయకులకు కూడా బయట కనిపిస్తుంది.
ఒకవేళ రెక్కల వద్ద ఏమైనా సమస్య వచ్చినా గుర్తించగలిగి వెంటనే విమాన కెప్టెన్ ను అలెర్ట్ చేయగలుగుతారు. అలాగే ల్యాండ్ అవుతున్న సమయం లో కూడా విమానం లోపల ఏమైనా ఇబ్బంది ఎదురైతే అది బయటివారికి కనిపిస్తుంది. వెంటనే ఎదో ఒక యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కిటికీలు మూసేసి ఉంచితే ఎవరికి ఏమి తెలియదు.. అందుకే ల్యాండ్ అయ్యే సమయం లో కూడా కిటికీలు తెరచి ఉంచాలని చెబుతారు.