రాజధాని ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఘజియాబాద్ నగరంలోని ఓ రహదారి పేరు దుర్గా భాభి మార్గ్. నేటి తరానికి దుర్గా భాభి గురించి అంతగా తెలియకపోవచ్చు. దుర్గా భాభి ఒకప్పుడు భగత్ సింగ్‌ను కాపాడడానికి ఆమె నగలను కూడా అమ్మేశారు. ఆయన భార్యగా నటించి, పోలీసుల నుండి భగత్ సింగ్‌ను రక్షించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారులకు ఎంతగానో సహాయం చేసి, దుర్గా భాభి తన వంతు పాత్రను పోషించారు. భగత్ సింగ్ ను కాపడం కోసం తన నగలను సైతం అమ్మిన దుర్గా భాభి ఎవరో ఇప్పుడు చూద్దాం..
దుర్గా భాభి పూర్తి పేరు దుర్గా దేవి వోహ్రా. ఆమె 1907 అక్టోబరు 7న అలహాబాద్‌లోని షాజాద్‌పూర్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి పండిట్ బాంకే బిహారీ అలహాబాద్ కలెక్టరేట్లో నజీర్, అతని తండ్రి మహేశ్ ప్రసాద్ భట్ జలౌన్ జిల్లాలో తానేదార్గా చేసేవారు. ఆమె తాత అయిన పండిట్ శివశంకర్ షాజాద్‌పూర్‌లో ఒక భూస్వామి. దుర్గా దేవి పదేళ్ల వయస్సులోనే లాహోర్‌కు చెందిన భగవతి చరణ్ బోహ్రాతో పెళ్లి జరిగింది. ఆమె మామ శివచరణ్ జీ రైల్వేలో ఉన్నత పదవిలో ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు రాయ్ సాహెబ్ బిరుదు ఇచ్చింది.
భగవతి చరణ్ బోహ్రా రాయ్ సాహెబ్ కుమారుడు అయినప్పటికీ, తన దేశాన్ని బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తి చేయాలనుకున్నాడు. క్రాంతికారి విప్లవ సంస్థలో ప్రచార కార్యదర్శి చేరాడు. 1920లో తన తండ్రి మరణించిన తరువాత, భగవతి చరణ్ వోహ్రా బహిరంగంగా ఉద్యమంలో చేరాడు. అందుకు ఆయన భార్య దుర్గా దేవి పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఆమె స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతోమందిని కాపాడారు. బ్రిటిష్ వారు లాలా లజపతిరాయ్ ని దారుణంగా కొట్టినపుడు, భగత్ సింగ్ ఒక బ్రిటిష్ జనరల్ ని షూట్ చేశారు.
భగత్ సింగ్ ని బ్రిటిష్ వారి నుండి తప్పించడానికి సుఖ్ దేవ్ దుర్గా దేవిని సహయం అడిగారు. అప్పుడు ఆమె తన మూడేళ్ల కుమారుడితో కలిసి భగత్ సింగ్ భార్యల నటించి, ఆయనను సురక్షితంగా లాహోర్ నుండి కలకత్తాకు పంపించారు. దుర్గా దేవి భర్త ఎస్హెచ్ఆర్ఏ మెంబర్. అందులోని మెంబర్స్ ఆమెను అందరు దుర్గా భాభి అని పిలిచేవారు. భగత్ సింగ్ మరియు అతని అనుచరులను ఉ-రి తీసినందుకు ఆమె లార్డ్ హెలిని చంపే ప్రయత్నం కూడా చేసింది. ఆయన తప్పించుకున్న అతని అనుచరులు గాయపడ్డారు. దుర్గా దేవి లాంటి ఎంతోమంది త్యాగధనులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలని అర్పించారు.