పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లితో ఇద్దరు వ్యక్తులే కాకుండా రెండు కుటుంబాలు మధ్య బంధం ఏర్పడుతుంది. వరుడు, వధువు కుటుంబాలు పెళ్ళిని ఘనంగా, వేడుకలా జరుపుతుంటారు.
గతంలో పెళ్లిని 5 రోజుల నుంచి 16 రోజుల పాటు వేడుకలా జరుపుకునేవారు. అయితే రానురాను వివాహ సంప్రదాయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అసలు పెళ్లి సంప్రదాయాలను ఎవరు? ఎప్పుడు మొదలుపెట్టారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
పూర్వకాలంలో వివాహ వ్యవస్థ లేదు. స్త్రీ, పురుషులు స్వతంత్రంగా జీవించేవారట. మహాభారతంలో వివాహం ఎలా వచ్చింది అనే కథ ఉంది. ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతు మహర్షి. ఒకసారి ఆయన తన ఆశ్రమంలో ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పురుషుడు తన తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అది చూసిన శ్వేతకేతు మహర్షికి ఆగ్రహం వచ్చింది. అయితే ఈ నియమం పూర్వ కాలం నుంచి వస్తోందని అతనికి తండ్రి ఉద్దాలక మహర్షి తెలిపారు.
శ్వేతకేతు మహర్షి ఈ నియమాన్ని వ్యతిరేకిస్తూ, ఇలా జీవించడం జంతువులలా జీవించడం వంటిదే అని, భార్య భర్తకు విధేయంగా ఉండే విధంగా వివాహ ధర్మాలను రూపొందించాడు. వివాహం తర్వాత వేరే పురుషుడి వద్దకు వెళ్లే భార్యకు పాపం వస్తుందని, అదేవిధంగా భార్యను వదిలి పర స్త్రీల దగ్గరికి వెళ్లే పురుషుడు పాప ఫలితాన్ని పొందాల్సి వస్తుందని తెలిపాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న దాంపత్య వ్యవస్థకు శ్వేతకేతు మహర్షి రూపొందించిన వివాహ ధర్మాలే మూలమని చెబుతుంటారు.
చరిత్ర ప్రకారం, ప్రపంచంలో 4 శతాబ్దాల కన్నా ముందు, దాదాపు 4,350 ఏళ్ల క్రితం మెసొపొటేమియాలో తొలిసారిగా వివాహం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది. మెసొపొటేమియాలో స్త్రీ, పురుషులు మొదటిసారిగా పెళ్లి వేడుకను జరుపుకున్నారట.
Also Read: ఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వల్ల ఆ 18 ఏళ్ల యువతి పెళ్లి ఆగిపోయింది.! ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి.?




జీ20 అంటే ఇరవై దేశాలతో ఏర్పడిన ఒక సమూహం. జీ-20 సదస్సు అనేది వరల్డ్ ఫైనాన్షియల్ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ జీ20సదస్సులోని దేశాలకు ప్రపంచంలోని ఆర్థిక ఉత్పత్తిలో ఎనబై ఐదు శాతం, ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. జీ20లో అర్జెంటీనా, యూకే, యూఎస్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మెక్సికో, ఇటలీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియేతో పాటు స్పెయిన్ శాశ్వత గెస్ట్ గా ఉంది.
ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సెక్యూరిటీ నుండి ఆతిథ్యం వరకు మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ ఏడాది జరగబోయే జీ-20లో స్థిరమైన అభివృద్ధి పై ఫోకస్ చేయనుంది.
అదే విధంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరగనుందని సమాచారం. అభివృద్ధి చెందిన దేశాలకు మంచి జరిగేలా తక్కువ ఇంట్రెస్ట్ కు రుణాలు ఇచ్చేలా ఎండీబీలో మార్పులు తీసుకురావాలని చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణంలోని మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరియు పేదరికం పై పోరాడడానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడతారని వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు.
ఇటీవల కాలంలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. పార్ట్ టైమ్ జాబ్స్ లో తమకు అనుకూలమైన సమయాలలో చేయగల జాబ్ లలో డెలివరీ బాయ్ జాబ్ ఒకటి. ప్రస్తుతం అనేక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో స్విగ్గీ కూడా ఒకటి. ఇందులో డెలివరీ బాయ్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి పనివేళలు రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మొత్తం పని గంటలు 5 గంటల 25 నిముషాల వరకు ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.
15 ఆర్డర్ల కు 750 రూపాయలు, 20 ఆర్డర్ల కు 1100 రూపాయలు, 25 ఆర్డర్ల కు 1500 రూపాయలు, 32 ఆర్డర్లు డెలివరీ చేసినట్లయితే 2000 రూపాయలు సంపాదించవచ్చు. ఎన్ని ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేస్తే అంత ఎక్కువ మనీ సంపాదించవచ్చు. సాధారణంగా స్విగ్గి పార్ట్ టైమ్ ఉద్యోగాల చేసేవారి జీతం రూ. 7000-15,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునవారికి, వారి అనుకూలమైన సమయాలలో చేసే అవకాశం ఉండడంతో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్ జాబ్ వైపుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.



ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్ సెంటర్‌కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం..
33. భూమి స్వభావం..
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం..
4. రవాణా సదుపాయం..
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..
ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.








