ప్రస్తుతం ఎక్కువ వినిపిస్తున్న మాట చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఇది అన్ని రంగాల్లోకి క్రమంగా ప్రవేశిస్తోంది. AI గురుంచి చెప్పాలంటే మనిషిలానే ఆలోచిస్తుంది, ప్రవర్తిస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల శ్రీరాముడి ఫొటోను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం AI రూపొందించిన ఫోటోలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో మాధవ్ కోహ్లీ అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఉపయోగించి హిందూ దేవుళ్ల అవతారాలను రూపొందించారు. మరి అవి ఏమిటో, ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1.శ్రీ రాముడు:
రీసెంట్ గా శ్రీరాముడు 21 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు అనేది ఊహించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.
2.సీత:
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సీత దేవి చిత్రాన్ని కూడా రూపొందించింది.
3.హనుమంతుడు:
రామ భక్తుడు, మహా శక్తిశాలి అయిన హనుమంతుడి చిత్రాన్ని కూడా AI ద్వారా రూపొందించారు.
4.కృష్ణుడు:
మహా విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడి చిత్రాన్ని సహజంగా రూపొందించింది.
5.శివుడు:
మహాశివుడు రూపాన్ని కూడా AI ద్వారా రూపొందించారు. ఇందులో శివుడు కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
6.కాళీమాత:
ఆదిపరాశక్తి అవతారాలలో ఒకటైన కాళీమాత చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు.

7.దుర్గా దేవి:
మహిషాసుర మర్ధిని అయిన దుర్గా దేవి చిత్రాన్ని AI ద్వారా రూపొందించారు. ఈ చిత్రంలో దుర్గాదేవి విశ్వరూపం ప్రదర్శించినట్టుగా కనిపిస్తోంది.
8.పార్వతి దేవి:
AI రూపొందించిన పార్వతి దేవి చిత్రం ఎంతో ప్రసన్నంగా ఉంది.
9.శ్రీ మహావిష్ణువు:
AI రూపొందించిన శ్రీ మహావిష్ణువు చిత్రం చాలా సహజంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.
10.బ్రహ్మ:
త్రిమూర్తులలో సృష్టి కారకుడైన బ్రహ్మ దేవుడి చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు.
11.వామన:
మహా విష్ణువు దశావతారాలలో ఒకటైన వామన అవతరాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు. వామన అవతరం అంటే సాధారణంగా బాలుడి రూపాన్ని ఎక్కువగా చూసి ఉంటాము. కానీ AI రూపొందించిన చిత్రంలో అలా లేదు.
12.గౌతమ బుద్దా:
దశావతారాలలో ఒకటిగా చెప్పే గౌతమ బుద్దుడి చిత్రాన్ని AI చాలా సహజంగా రూపొందించింది.
13.నరసింహ:
విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతరాన్ని కూడా AI రూపొందించింది.
14.వరహ:
దశావతారాలలోని వరహ అవతారాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు.
15.కల్కి:
శ్రీమద్భాగవతంలో చెప్పిన ప్రకారం కల్కి అవతారం కలియుగం అంతంలో వస్తుందని చెబుతారు. అయితే తాజాగా AI ద్వారా కల్కి రూపాన్ని రూపొందించారు.
Also Read: “శ్రీరాముడు” 21 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో తెలుసా?

ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల పెట్రోల్‌కు మొత్తం రూ. 3.60. అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.

భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ముందుకు వెళ్తే ఆ బంధంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం చిన్న కారణాలతో వచ్చిన గొడవలు పెద్దగా మారి విడాకులకు దారి తీస్తుంటాయి.ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్యభర్తలు విడిపోయినపుడు కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తాయి.
భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినపుడు, లేదా విడాకుల కేసు కోర్టులో కొనసాగుతున్న సమయంలో ఎటువంటి ఆదాయం లేని భార్య జీవితాన్ని గడపడం కోసం ఇవ్వవలసిన డబ్బును మెయింటెనెన్స్ అని పిలుస్తారు. భార్య ఆహారం, వసతి, దుస్తులతో పాటుగా వారి పిల్లల చదువు మరియు ఇతర బాగోగులను కూడా భర్త చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశించినప్పటికి కూడా భర్త ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోయినట్లయితే సదరు భార్య మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఆ సమయంలో కొన్ని ఆధారాలను చూపించాలి.
ఆమె తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని, అలాగే భర్త టనను తాను పోషించుకునే స్థితిలో ఉన్నాడనే ఆధారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తమడి చట్టబద్ధమైన వివాహం అనే చెప్పే సాక్ష్యం, అలాగే ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పే సాక్ష్యం, కోర్టు అడిగిన ఆధారాలు చూపించడం ద్వారా రావలసిన మెయింటెనెన్స్ ని పొందవచ్చు.














