ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో మామూలుగా ఎవరైనా సరే ఓటు హక్కును వినియోగించుకొని తమకి నచ్చిన వారిని గెలిపించాలి అని అంటారు. ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న వాళ్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ కారణంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్లకి వాళ్లు ఓటు వేసుకున్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కొన్ని కారణాల వల్ల తమ ఓటు తమ కోసం వేసుకోలేకపోయారు. వాళ్లు వేరే అభ్యర్థులకు ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ ఓటు తమకి వేసుకోలేదు. వాళ్ళు ఎవరంటే.

అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ లోక్ సభ స్థానం నుండి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇల్లు రాజేంద్రనగర్ లో ఉంది. ఆ ప్రాంతం చేవెళ్ల పరిధిలోకి వస్తుంది. చేవెళ్ల నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తరపున ఎవరు అభ్యర్థులు లేరు. ఈ కారణంగా ఆ పార్టీకి ఎవరైనా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. అందుకే అసదుద్దీన్ ఓవైసీ తను గెలవడానికి తనకోసం తను వేసుకోలేకపోయారు.
పట్నం సునీత మహేందర్ రెడ్డి
మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేశారు. సునీత ఓటు తాండూరు పరిధికి వెళ్తుంది. ఇది కూడా చేవెళ్ల పరిధిలోనే ఉంది. ఈ కారణంగా తన ఓటు తనకోసం కాకుండా మరొకరి కోసం వేయాల్సి వచ్చింది.
కొంపెల్ల మాధవి లత
బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పోటీ చేశారు. కొంపెల్ల మాధవి లత సికింద్రాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్ లో ఉంటారు. ఆ ప్రాంతం మల్కాజ్ గిరి పరిధిలోకి వెళ్తుంది. ఈ కారణంగా మాధవి లత తన కోసం తాను ఓటు వేసుకోలేకపోయారు.
చాలా మంది అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో వారే ఓటు వేసుకున్నారు. కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ నియోజకవర్గాల్లో ఓటు వేసుకోలేకపోయారు. వారికోసం వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.

నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. 
















