ఎవరైనా ఒక జంట వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తే విడిపోవడం అనేది సహజం. క్రికెట్ రంగంలో కూడా అలా కొంత మంది జంటలు వారి వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ నిఖిత అనే తన చిన్ననాటి స్నేహితులిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. 2015 లో ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తో దినేష్ కార్తీక్ వివాహం జరిగింది. మురళి విజయ్, దినేష్ కార్తీక్ లు మంచి స్నేహితులు. తరచూ దినేష్ ఇంటికి వస్తూ.. వెళ్తూ ఉండే మురళి విజయ్ దినేష్ భార్య నికిత తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నారు. అయితే..ఈ సంగతి తెలుసుకున్న దినేష్ నిఖితా కు విడాకులు ఇచ్చేసాడు. ఆ తరువాత నిఖిత, మురళి విజయ్ లు పెళ్లి చేసుకున్నారు.

#2 వినోద్ కాంబ్లీ
వినోద్ కాంబ్లీ తన స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ని వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆండ్రియా అనే మోడల్ ని పెళ్లి చేసుకున్నారు.

#3 శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి నటి ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.
#4 మొహమ్మద్ షమీ
మొహమ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్ ని పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు చీర్ లీడర్ గా చేసిన హసీన్ జహాన్ పెళ్లయిన తర్వాత తన వృత్తికి వీడ్కోలు పలికారు. కానీ అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.
#5 షోయబ్ మాలిక్
2002లో అయేషా సిద్ధిఖీ అనే ఒక మహిళను వివాహం చేసుకున్నారు షోయబ్ మాలిక్. తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు. 2010 లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ని వివాహం చేసుకున్నారు.
#6 సనత్ జయసూర్య
సనత్ జయసూర్య 1998లో సుముధు అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఒక సంవత్సరానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2000 సంవత్సరంలో సాండ్రా ని పెళ్లి చేసుకున్నారు. 2021లో వారిద్దరూ విడిపోయారు.
#7 జవగళ్ శ్రీనాథ్
ప్రముఖ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ జోత్స్నా అనే యువతిని వివాహం చేసుకున్నారు. తర్వాత మాధవి అనే జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకున్నారు.
#8 మహమ్మద్ అజారుద్దీన్
మొదట నౌరీన్ అనే మహిళతో మహమ్మద్ అజారుద్దీన్ వివాహం జరిగింది. తరువాత 1996 లో సంగీతా బిజ్లానీ, మొహమ్మద్ అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నారు.
#9 బ్రెట్ లీ
2006లో ఎలిజబెత్ ని పెళ్లి చేసుకున్నారు బ్రెట్ లీ. పెళ్లయిన రెండు సంవత్సరాలకి వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2014లో లానా అండర్సన్ తో బ్రెట్ లీ వివాహం జరిగింది.
#10 యోగరాజ్ సింగ్
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా క్రికెటర్. యోగరాజ్ సింగ్, షబ్నం సింగ్ కొడుకు యువరాజ్ సింగ్. తర్వాత వారిద్దరూ విడిపోయారు. యోగరాజ్ సింగ్ మళ్లీ సత్వీర్ కౌర్ అనే ఒక మహిళని పెళ్లి చేసుకున్నారు.








 హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్‌గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది.
హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్‌గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది. ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది. అందులో 137 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన  మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్ జట్టుకు  కెప్టెన్‌గా సారధ్యం వహించింది.
ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది. అందులో 137 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన  మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్ జట్టుకు  కెప్టెన్‌గా సారధ్యం వహించింది. సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్‌ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.
సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్‌ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.











