ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై జట్టు తమ మంచి ప్లేయర్స్ ని ఎంచుకుంటూనే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా పేరు గాంచిన చెన్నై ఎప్పుడు తమ జట్టు బలంగా ఉండేలానే చూసుకుంటుంది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌కి ముందుగా జరిగే మినీ వేలం లో కొందరు ఆటగాళ్లను చెన్నై రిటెన్షన్ చేసుకోగా .. మరికొందరిని విడుదల చేయనుంది.
అయితే ఏ లిస్ట్ ఏ ఆటగాళ్లున్నారో చూద్దాం..
చెన్నై జట్టు రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లలో ధోని, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, దీపక్ చాహర్ తో సహా పలువురు ఆటగాళ్లున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే చెన్నై విడుదల చేయనున్న ఆటగాళ్లలో.. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్, ఊతప్ప, ప్రశాంత్ సోలంకి, భగత్ వర్మ, హరినిశాంత్ సహా పలువురు ఆటగాళ్లున్నారు.

వీరిలో 2022 మెగా వేలంలో కివీ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.90 కోట్లకు కొనుగోలు చేసింది. అతను చెన్నై తరపున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందులో అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అలాగే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.3.60 కోట్ల ధరకు జట్టులో చేర్చుకుంది. జోర్డాన్ చెన్నై తరపున మొత్తం 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలం 2022లో రూ. 1.9 కోట్లకు తమ జట్టులోకి తీసుకున్నారు. అతను 2022లో చెన్నై తరపున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు గతేడాది ఐపీఎల్ నుంచి సీఎస్కే యాజమాన్యం, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదిలా ఉండగా తాను చెన్నై జట్టులోనే ఉన్నట్లు జడేజా కొన్ని హింట్స్ ఇస్తున్నట్టు సమాచారం.








మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.

















#16
#17
#18
#19







