ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా పేరున్న చెన్నై జ‌ట్టు తమ మంచి ప్లేయర్స్ ని ఎంచుకుంటూనే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా పేరు గాంచిన చెన్నై ఎప్పుడు తమ జట్టు బలంగా ఉండేలానే చూసుకుంటుంది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌కి ముందుగా జరిగే మినీ వేలం లో కొందరు ఆటగాళ్లను చెన్నై రిటెన్ష‌న్ చేసుకోగా .. మరికొందరిని విడుదల చేయనుంది.
అయితే ఏ లిస్ట్ ఏ ఆటగాళ్లున్నారో చూద్దాం..

Video Advertisement

చెన్నై జట్టు రిటెన్ష‌న్ చేసుకున్న ఆటగాళ్లలో ధోని, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, దీపక్ చాహర్ తో సహా పలువురు ఆటగాళ్లున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే చెన్నై విడుదల చేయనున్న ఆటగాళ్లలో.. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్, ఊతప్ప, ప్రశాంత్ సోలంకి, భగత్ వర్మ, హరినిశాంత్ సహా పలువురు ఆటగాళ్లున్నారు.

LIST OF PLAYERS MAY RELEASE FROM CSK BEFORE IPL
వీరిలో 2022 మెగా వేలంలో కివీ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.90 కోట్లకు కొనుగోలు చేసింది. అతను చెన్నై తరపున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందులో అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అలాగే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.3.60 కోట్ల ధరకు జట్టులో చేర్చుకుంది. జోర్డాన్ చెన్నై తరపున మొత్తం 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

LIST OF PLAYERS MAY RELEASE FROM CSK BEFORE IPL

న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలం 2022లో రూ. 1.9 కోట్లకు తమ జట్టులోకి తీసుకున్నారు. అతను 2022లో చెన్నై తరపున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు.

LIST OF PLAYERS MAY RELEASE FROM CSK BEFORE IPL

మరోవైపు గతేడాది ఐపీఎల్‌ నుంచి సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్‌కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదిలా ఉండగా తాను చెన్నై జట్టులోనే ఉన్నట్లు జడేజా కొన్ని హింట్స్ ఇస్తున్నట్టు సమాచారం.