సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి మధ్య ఆదివారం జరిగిన మొదటి టెస్ట్ లో కేఎల్ రాహుల్ సెంచరీ చేశారు. 218 బంతుల్లో 14×4, 1×6 సాయంతో 100 పరుగుల మార్క్‌ని అందుకున్నారు కేఎల్ రాహుల్. రాహుల్ కి ఇది టెస్ట్ కెరీర్ లో ఏడవ సెంచరీ.
భారత్ జట్టు 78 ఓవర్లు ముగిసే సమయానికి 238/3తో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60: 123 బంతుల్లో 9×4)తో కలిసి మొదటి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్. ఇన్నింగ్స్ లో 41వ ఓవర్ వేసిన లుంగి ఎంగిడి వరుస బంతుల్లో మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా (0)ని పెవిలియన్ బాట పట్టేలా చేశారు.
ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (35: 94 బంతుల్లో 4×4)తో కలిసి కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సంవత్సరం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ లో 129 పరుగులు చేసిన రాహుల్ కి, 2021లో ఇది రెండవ సెంచరీ. అంతే కాకుండా ఆసియా వెలుపల అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత ఓపెనర్ గా రాహుల్ నిలిచారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12