ఆ 5 ఆటగాళ్లపై కన్నేసిన RCB.? “డివిలియర్స్” స్థానం భర్తీ చేసేదెవరో..?

ఆ 5 ఆటగాళ్లపై కన్నేసిన RCB.? “డివిలియర్స్” స్థానం భర్తీ చేసేదెవరో..?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సీనియర్ ప్లేయర్లతో పాటు, కొంత మంది యువ ప్లేయర్లని కూడా ఎంపిక చేసారు.

Video Advertisement

అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ముగ్గురు ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టేందుకు అన్ని రకాలుగా ఆర్‌సీబీ జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేయగల ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Also Read: “కేఎల్ రాహుల్ అలా చేస్తే అస్సలు ఊరుకోము..!” అంటూ… PBKS ఓనర్ షాకింగ్ కామెంట్స్..!

#1 శ్రేయాస్ అయ్యర్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి రిలీజ్ అయిన తర్వాత శ్రేయాస్ కూడా ఆక్షన్ లో ఉంటారు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కి
శ్రేయాస్ కి స్థిరత్వం కల్పించేందుకు బెంగళూరు జట్టు ప్రయత్నాలు చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా, శ్రేయాస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

key players that rcb might buy during mega auction

#2 అశ్విన్

ఆర్‌సీబీకి మెరుగైన బౌలర్లు కూడా చాలా అవసరం. దాంతో యాజమాన్యం దృష్టి అశ్విన్‌పై పడింది. గత కొన్ని టి 20 ల నుండి తన బౌలింగ్ తో రాణిస్తున్న అశ్విన్‌పై అన్నీ జట్ల చూపు ఉందని చెప్పడంలో సందేహమే లేదు.

key players that rcb might buy during mega auction

#3 డేవిడ్ వార్నర్

#4 దేవదత్ పడిక్కల్

దేవదత్ పడిక్కల్ ఆర్‌సీబీ కోసం ఓపెనింగ్ చేసారు. గత సీజన్ వరకు కూడా అత్యధిక పరుగులు సాధించారు. అయినా కూడా పాడిక్కల్ ని రెటైన్ చేసుకునేందుకు యాజమాన్యం ఆసక్తి చూపలేదు. కానీ ఆర్‌సీబీ మాత్రం దేవదత్ పడిక్కల్ ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతోంది అని సమాచారం.

key players that rcb might buy during mega auction

#5 షిమ్రాన్ హెట్మేయర్

ఇప్పటికే బెంగుళూరు జట్టు యాజమాన్యం మాక్స్‌వెల్ ని వారి వద్దే ఉంచుకున్నారు. ఈ క్రమంలో హెట్మేయర్ ని కొనుగోలు చేయడం అనేది వారి బ్యాటింగ్ కి బలం అవుతుంది. అంతే కాకుండా, ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్‌లో ఎడమ చేతి వాటం ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా లేకపోవటంతో హెట్మేయర్ ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

key players that rcb might buy during mega auction

కొద్ది రోజుల క్రితం డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారో? ఇది తెలియాలంటే ఇంకా కొంత సమయం వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like