మన జీవితం లో స్మార్ట్ ఫోన్ నిత్యావసరం అయిపొయింది. అయితే.. మనం డౌన్ లోడ్ చేసుకునే ఆప్ ల వలన మనకు ఎక్కడలేని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే.. గూగుల్ సంస్థ మాత్రం ఇటువంటి ఆప్ ల పై ఓ కన్నేసి ఉంచుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకపోతేనే.. వాటిని ప్లే స్టోర్ లో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
అయితే.. కొన్ని సార్లు కొన్ని ఆప్ ల వలన మన ఫోన్ లోకి వైరస్ లు వస్తూ ఉంటాయి. అయితే.. ఇలాంటి వాటిని గూగుల్ చాలానే హేండిల్ చేసింది. కానీ.. ఒకప్పుడు గూగుల్ ని ముప్పు తిప్పలు పెట్టేసిన “జోకర్” వైరస్ గుర్తుందా..? ఈ వైరస్ ని డిసేబుల్ చేశామని అనుకున్నప్పటికీ.. ఇది మళ్ళీ ఎనిమిది ఆప్ లలో కనిపిస్తోంది. క్విక్ హీల్ సెక్యూరిటీ లాబ్ లోని పరిశోధకులు ఈ విషయాన్నీ గుర్తించారు. తాజాగా.. గూగుల్ కూడా దీనిని గుర్తించి వెంటనే ఆ ఆప్ లను డిలీట్ చేసేసింది.
అయితే.. గూగుల్ ఆ ఆప్ లను డిలీట్ చేసేసినా.. వాటిని ఇదివరకు ఏ వినియోగదారుడైనా డౌన్ లోడ్ చేసుకుని ఉండి ఉంటె ఆ ఆప్ లు రన్ అవుతూనే ఉంటాయి. వాటివలన ఆ వైరస్ వారి ఫోన్లలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 8 ఆప్ లను డౌన్లోడ్ చేసుకుని ఉండి ఉంటె వెంటనే డిలీట్ చేసేయండి. ఇంతకు ఆ ఎనిమిది ఆప్ లు ఏమిటంటే:
- ఆక్సిలియారి మెసేజ్
- ఫాస్ట్ మేజిక్ SMS
- సూపర్ మెసేజ్
- సూపర్ SMS
- గో మెసేజెస్
- ట్రావెల్ వాల్ పేపర్స్
- ఫ్రీ కామ్ స్కానర్
- ఎలిమెంటరీ స్కానర్