రజనీకాంత్ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రీమేక్ సినిమా అయినా కూడా, తెలుగులో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమా అయినా కూడా, దీనికంటూ ఒక స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా రూపొంది ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : చంద్రముఖి 2
- నటీనటులు : రాఘవ లారెన్స్, మహిమా నంబియార్, కంగనా రనౌత్.
- నిర్మాత : సుభాస్కరన్
- దర్శకత్వం : పి వాసు
- సంగీతం : ఎం ఎం కీరవాణి
- విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023

స్టోరీ :
రాధిక కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వారి సమస్యలని తీర్చడానికి పండితుడు (రావు రమేష్) వస్తాడు. వారికి అనుకోకుండా మదన్ (లారెన్స్) కలుస్తాడు. రాధిక కుటుంబం ఒక గుడిని బాగు చేయించాలి అనుకుంటూ ఉంటారు. మరొక పక్క ఒక అమ్మాయి (మహిమా నంబియార్) వెట్టయన్ రాజు (ఇంకొక లారెన్స్) కోటలో ఏం ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి మదన్ సహాయం చేస్తూ ఉంటాడు.

అయితే మదన్ కి మాత్రం, ఆ కోటలో ఉన్న దక్షిణం వైపు ఉన్న గదిలో ఏదో ఉన్నట్టు అనుమానం వస్తుంది. తర్వాత అక్కడ ఉన్నది చంద్రముఖి (కంగనా రనౌత్) అని, ఆమె ఆత్మ ఆ ఇంట్లో ఉన్న ఒకరిని ఆవహించింది అని అర్థం అవుతుంది. అసలు చంద్రముఖి ఎవరు? వెట్టయన్ రాజుకి ఆమెకి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆమె ఎలా చనిపోయింది? ఆమె ఆత్మ ఎవరిని ఆవహించింది? ఇదంతా మదన్ ఎలా కనిపెట్టాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రేక్షకుల మైండ్ లో అలా నిలిచిపోతాయి. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన విషయం మరొక సినిమాలో ఏదైనా ఉంది అని తెలిస్తే అది ఏదో పర్సనల్ విషయంగా ఫీల్ అవుతారు. “మా సినిమాని పాడు చేయరు కదా?” అని అనుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తున్నా కూడా చాలా మంది ప్రేక్షకుల్లో ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది.

ఆ ఫీల్ అయితే ఈ సినిమా పోగొట్టదు కదా అని అనుకున్నారు. డైరెక్టర్ ఒకరే. అయినా కూడా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే తెలిసిన కథే అయినా కూడా ఒక ట్విస్ట్ యాడ్ చేశారు. అయితే, చంద్రముఖికి, చంద్రముఖి 2 కి మధ్యలో హారర్ కామెడీ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. ఒక కోట, ఆ కోటలో ఒక ఆత్మ, ఆ ఆత్మకి ఒక కోరిక, ఆమెకి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి.

దాంతో ఎంత చంద్రముఖి సినిమాకి సీక్వెల్ అయినా కూడా, ఈ సినిమా చూస్తుంటే కొత్తగా ఏమీ అనిపించదు. అంతే కాకుండా మొదటి పార్ట్ లో ఉన్నది అసలు చంద్రముఖి కాదు అని, గంగ చంద్రముఖి ఉన్నట్టు ఊహించుకుంది అని, ఇప్పుడు వచ్చిన చంద్రముఖి అసలు చంద్రముఖి అని చెప్తారు. ఆ పాయింట్ మాత్రం కాస్త ఎక్కదు. సినిమా మొదటి పార్ట్ కి కొనసాగింపు అయినా కూడా ఒక్క వడివేలు పాత్ర తప్ప మిగిలిన ముఖ్య పాత్రలు ఈ సినిమాలో కనిపించరు.

మధ్యలో పూజ చేయడానికి వచ్చిన మనోబాల పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. రజినీకాంత్, జ్యోతిక పాత్రలతో పోల్చకుండా చూస్తే రాఘవ లారెన్స్, కంగనా కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. కానీ ఒకవేళ పోలిస్తే మాత్రం జ్యోతిక క్రియేట్ చేసిన ప్రభావం కంగనా క్రియేట్ చేయలేకపోయారు ఏమో అనిపిస్తుంది. పాటలు చాలా బాగున్నాయి అనలేము, అలా అని బాగాలేదు అని కూడా అనలేము.

అలా వెళ్ళిపోతాయి అంతే. రారా పాట విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అసలు ఒరిజినల్ పాటని అలాగే ఉంచి ఉన్నా కూడా బానే ఉండేది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఆ పాట. అందుకే ఈ పాట విన్నప్పుడు ఇది కాస్త కొత్తగా అనిపిస్తుంది. కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు. యాక్షన్ పర్వాలేదు. కానీ మొదటి చంద్రముఖిలో ఇంత భారీ బడ్జెట్ సీన్స్ ఉండవు.

ఇంత కాస్ట్లీ గ్రాఫిక్స్ కూడా ఉండదు. ఇంతమంది భారీ తారాగణం, ఇంత గొప్ప కాస్ట్యూమ్స్ కూడా లేవు. ఆ విషయాలు అన్నిటిలో కూడా ఈ సినిమా ముందు ఉంది. మంచి గ్రాఫిక్స్, డిజైనర్ కాస్ట్యూమ్స్, కలర్ ఫుల్ గా ఉన్న సినిమాటోగ్రఫీ, చాలా మంది నటీనటులు. కానీ అందులో ఉన్న మ్యాజిక్ మాత్రం ఈ సినిమాలో లేదు ఏమో అనిపిస్తుంది. అంతా బాగున్నా కూడా సినిమా ముందుకు వెళుతున్న కొద్ది ఆసక్తికరంగా అనిపించదు. ఏదో మిస్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కాస్ట్యూమ్స్
- సెట్టింగ్స్
- క్లైమాక్స్ లో వచ్చే సీన్స్
మైనస్ పాయింట్స్:
- కథలో లోపించిన కొత్తదనం
- మిస్ అయిన మొదటి పార్ట్ మ్యాజిక్
- కామెడీ పేరుతో వచ్చే కొన్ని సీన్స్
- అనవసరమైన చోట్ల వచ్చే పాటలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఒరిజినల్ తో పోల్చకుండా, రొటీన్ గా ఉన్నా కూడా పర్వాలేదు, అసలు ఈ చంద్రముఖిని ఎలా చూపించారు అని తెలుసుకుందాం అని చూడాలి అనుకుంటే చంద్రముఖి 2 సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “అఖండ”లో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..? అసలు హీరోయిన్ ఏం చేసింది..?









ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు.
కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు స్టార్ హీరోల సినిమాలకి రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ స్పెషల్ షోలుగా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో డబ్ అయిన సినిమాలకు కూడా రీరిలీజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలకు రీరిలీజ్ లో అద్భుతమైన ఆదరణ వచ్చింది. దాంతో ఈ రోజు కల్ట్ క్లాసిక్ 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ చేశారు.
2004 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీతో పాటు, అందులోని సాంగ్స్ కు అప్పటి యూత్ ఫిదా అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించింది.
కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాని ఇప్పటికి టీవీలలో ప్రసారం అయితే చూడటానికి ఇష్టపడతారు. 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ కోసం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేసింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. ఇక ఈ మూవీ రీరిలీజ్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ను మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.













మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యకు వ్యతిరేక అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్రచారకర్తగా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్‌టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. సెలెబ్రెటీ కానప్పటికీ. సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో ప్రారంభం అయ్యి, రెండు వారాలు పూర్తి కాగా, రెండుసార్లు ప్రశాంత్ నామినేషన్స్ లో నిలిచాడు. కానీ టోటల్ ఓటింగ్ లో నలబై శాతం ఓట్లు అతనికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ బలమైన కంటెస్టెంట్ అని హౌజ్ మెంబర్స్ ఇప్పటికే పసిగట్టారు. దాంతో జనాల్లో రైతుబిడ్డ పై సింపథీ పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రెండవ వారం నామిషన్స్ లో రితికా రోజ్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు కొందరు ప్రశాంత్ పై అటాక్ చేశారు. సింపథీ మాటలు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ప్రశాంత్ కున్న క్రేజ్ తగ్గకపోగా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి. రైతుబిడ్డగా పాపులర్ అయిన ప్రశాంత్ ఫ్యామిలీ కాస్త డబ్బు ఉన్న ఫ్యామిలీ అని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి దాదాపు 26 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అది మాత్రమే కాకుండా సొంత ఊరిలో పెద్ద ఇల్లుతో పాటుగా, కాస్ట్లీ లగ్జరీ కారు కూడా ఉందని టాక్. ప్రశాంత్ పొలం, హౌజ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వ్యవసాయ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయని టాక్. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
గతంలో పవన్ కల్యాణ్ పూజలు, జాతకాలకు అంటే కాస్త దూరంగా ఉంటారని టాలీవుడ్ లో టాక్ ఉండేది. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తోందని టాక్. జ్యోతిష్యు పండితులను కలిసి, జాతకంలో ఉన్న దోషాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారట. హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కలిసిన అనంతరం, పవన్ కళ్యాణ్, బాలయ్య, నారా లోకేష్ లతో పాటు మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ హైలెట్ అయ్యాయి. అప్పటి నుండి వాటి గురించే చర్చ జరుగుతోంది. ఆ ఉంగరాల విశిష్టత ఏమిటా అని చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రెండు రింగ్స్ లో ఒకటి నాగ బంధం, రెండవది కూర్మావతారం. ఈ రెండు కూడా బంగారు రింగ్స్. పెద్ద సైజులో కూడా ఉన్నాయి.
నాగ బంధం, కూర్మావతారం రింగ్స్ కు విశిష్టత ఉందని, ఇవి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నాగ బంధం రింగ్ వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని ప్రమాదాలు లేదా గండాల నుంచి కపడుతుంది. దుష్ట శక్తుల,రాహు కేతు దోషాలు మరియు నరదిష్టి దోషాల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. కానీ నాగ బంధం ఉంగరాన్ని జోతిష్యం ఆధారంగా మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఇక తాబేలు లేదా కూర్మావతారం రింగ్ ధరించడం వల్ల అధికార యోగం మరియు ధన యోగం కలుగుతుందని, అధికార యోగం కోసం దైవబలం కోరుకునేవారు తాబేలు రింగ్ ను ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఈ రెండు రింగ్స్ వల్ల వస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు.