ఆరాటం ముందు ఆటంకం ఎంత..సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ద్రుడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అని ఒక సినిమా పాట ఉంటుంది.. ఆ పాటలోని ప్రతి అక్షరం అతడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.. పేదరికంగ, వైకల్యం ఇవేవి అతడి సంకల్పానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి.. అనుకున్నది సాధించి రియల్ విన్నర్ అనిపించుకున్నాడు, ఎందరికో ఆ రోల్ మోడల్ అయ్యాడు… అతడే కట్టా సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్..

తూర్పు గోదావరి జిల్లా, మలికి పురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన సింహాచలం కలెక్టర్ అయ్యాడు.. ఇందులో గొప్ప విషయం ఏముంది..ప్రతి ఏడాది చాలా మంది సివిల్స్ కొడతారు కదా అనుకుంటున్నారా.. కాని సింహాచలం గెలుపు గురించి మనం మాట్లాడుకోవాలి ..ఎందుకంటే పుట్టుకతో అంధుడు, పేదరికం ఇలా ఎన్నో కష్టాలని అధిగమించి ప్రస్తుతం అతడు ఈ విజయాన్ని దక్కించుకున్నాడు.

సింహాచలం తల్లిదండ్రులు కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఐదుగురు సంతానం, వారిలో సింహాచలం నాలుగవ వాడు, పుట్టుకతో అంధుడు..తండ్రి పాత గోని సంచుల వ్యాపారం చేసేవాడు, అదే ఆ కుటుంబానికి జీవానాధారం..పిల్లల్ని చదివించే స్తోమత లేని తండ్రి, చదువుకోవాలనుకునే కోరిక బలంగా ఉండి ఏం చేయాలో పాలుపోని సింహాచలానికి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్ చదువుకునే అవకాశం దక్కింది.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింహాచలం అక్కడ నుండి మలికిపురం ఎంవీఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.. సింహాచలం చదువు పూర్తి కావడానికి కొందరు దాతలు తమ చేయందించారు.

డిగ్రీ చదువుతున్న టైంలోనే ఐఏఎస్ కావాలని కలలు కన్నాడు.కానీ అదే సమయంలోనే తండ్రి పోవడంతో , ఇక కుటుంబానికి భారం కాకూడదనుకుని బిఇడి పూర్తి చేసి, తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా చేరారు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికి కలెక్టర్ అవ్వాలనే కోరిక సింహాచలం మనసులో నుండి పోలేదు..దాంతో 2014 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్ అయ్యే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినా నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించాడు.

Image source : ETVAndhrapradesh
2016లో పరీక్ష రాస్తే ఐఆర్ఎస్ లో అవకాశం వచ్చింది. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాడు.మొత్తానికి 2019 ఐఏఎస్ ఫలితాల్లో ర్యాంకు సాధించాడు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తైంది..అసిస్టెంట్ కలెక్టర్ గా ఆంధ్రా కేడర్ కి ఎంపిక అయ్యాడు. కాబట్టి కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని కలాం గారు చెప్పారు, సింహాచలం నిరూపించారు..హ్యాట్సాఫ్..

Image source : ETVAndhrapradesh
సివిల్స్ కి ప్రిపేరవుతున్నాం అనగానే చాలా మంది ఒకసారి మనల్ని కింది నుండి పై వరకు చూసి ఒక వెకిలి నవ్వు పడేస్తారు. సింహాచలం కథ ద్వారా మనకి అర్దం కావాల్సింది.. మన మీద మనకి నమ్మకం ఉండాలని.. మనం పెట్టుకున్న గోల్ చూసి చాలామందికి నవ్వు రావొచ్చు, నమ్మకం లేకపోవచ్చు..కాని ఆ నవ్వుల్ని చూసి అక్కడే ఆగిపోతే మరింత నవ్వుల పాలవుతాం.. నవ్విన వాళ్లతోనే శెభాష్ అనిపించుకునే శక్తి మనకే ఉంది..కమాన్..







‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.




రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.












