రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రామ్‌చరణ్ 16వ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంపరాఫర్‌ను అందుకున్నాడు. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్ఫణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించబోతున్నారు. కథానాయికతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పేరు ని పరిశీలిస్తున్నారట మేకర్స్.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర సమాచారం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకం గా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. తొలి చిత్రం తో 100 కోట్లు వసూలు చేసిన బుచ్చి బాబు ని నమ్మి మేకర్స్ ఇంత భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట బుచ్చిబాబు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో దేశవిదేశాల్లో చరణ్ మార్కెట్ భారీగా పెరిగిన నేపథ్యంలో మేకర్స్ ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడకూడదని భావిస్తున్నారని సమాచారం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.