కరోనాతో భర్త చనిపోయిన తర్వాత అతని ఫోన్ లో ఊహించని మెసేజ్ చూసిన భార్య.

కరోనాతో భర్త చనిపోయిన తర్వాత అతని ఫోన్ లో ఊహించని మెసేజ్ చూసిన భార్య.

by Anudeep

Ads

కరోనా బారిన పడి చనిపోయిన ఒక అమెరికన్ తన భార్యకు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది..తన భార్యను, పిల్లల్నుద్దేశిస్తూ అతడు రాసిన వాక్యలు కంటతడి పెట్టిస్తున్నాయి..జోనాధన్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలోకి కరోనా రూపంలో అంతా తలకిందులైంది. న్యాయస్థానంలో పనిచేసే  జోనాథన్  కరోనా వల్ల భయపడుతూనే తగిన జాగ్రత్తలు పాటిస్తూనే విధులకు హాజరవుతున్నాడు. అయినప్పటికి కరోనా బారిన పడకతప్పలేదు.

Video Advertisement

కరోనా పాజిటివ్ రావడంతో డాన్బరీలోని హాస్పిటల్ కి తరలించారు.. అతన్ని పరీక్షించిన వైద్యులు మొదట జోనాథన్ ను రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాలని చెప్పారు. కానీ, ఆ తర్వాత జోనాథన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌లో ఉంచారు. మార్చి 26న హాస్పిటల్లో జాయిన్ అయిన జోనాథన్  ఏప్రిల్ 22 న హార్ట్ ఎటాక్ తో మరణించాడు. హాస్పిటల్లో ఉన్న 28రోజుల్లో 20 రోజులపాటు వెంటిలేటర్ పైనే ఉన్నాడు. 

డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుండగానే జోనాథన్ మరణించాడు. అతడు  చనిపోయిన తర్వాత డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు.భర్త మరణ వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న భార్య కన్నీటి పర్యంతమైంది..హాస్పిటల్లో ఉన్న భర్త వస్తువులను ఆమెకి అందించింది హాస్పిటల్ సిబ్బంది.

ఆ వస్తువుల్లో జోనాథన్ ఫోన్ కూడా ఉంది.. ఆ ఫోన్లో జోనాథన్ రాసిన లెటర్ కేటి కంటపడింది.. భర్త రాసిన ఆ లెటర్ చదివిన కేటి మరియు పిల్లలు మరింత భావేద్వేగానికి గురయ్యారు. జోనాథన్ రాసిన లెటర్ అతని మాటల్లోనే “నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటివరకు నేను కోరుకున్న జీవితాన్ని నాకు అందించావు. నీకు భర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మన పిల్లలు బ్రాడిన్ మరియు పెన్నీలకు తండ్రిని కావడం కూడా గర్వపడే విషయం.

నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను కలుసుకున్న అత్యంత అందమైన వ్యకివి నువ్వు. నువ్వు చాలా స్పెషల్. నువ్వు పిల్లలు సంతోషంగా బతుకుతారని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. ఆ నవ్వే నన్ను నీతో ప్రేమలో పడేలా చేసింది. నువ్వు పిల్లలకు మంచి తల్లిగా ఉండటం గొప్ప విషయం” అంటూ..

పిల్లల గురించి కూడా జోనాథన్ ఆ లెటర్లో ప్రస్తావించాడు.. “బ్రాడిన్ నాతో అత్యంత అనుబంధం కలిగినవాడు. నేను అతనికి తండ్రిని అయినందుకు  గర్వపడుతున్నాను. అతను చేసిన మరియు చేస్తున్న అద్భుతమైన పనులన్నింటికీ గర్వపడుతున్నాను. పెనెలోప్ ఒక యువరాణి. తను కోరుకున్నది తనకు దక్కుతుంది. నిన్ను, పిల్లలను ప్రేమించే వ్యక్తి ఎవరైనా నీకు నచ్చితే అతనితో సంతోషంగా ఉండండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’”అని జోనాథన్ తన ఫోనులో భార్యా, పిల్లల గురించి కంటతడిపెట్టించేలా రాశాడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్త నెటిజన్లందరి చేత కంటతడి పెట్టిస్తున్నది.


End of Article

You may also like