Ads
ఆసియా కప్ 2023 లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. టీం ఇండియా ఆటగాళ్లు అర్థసెంచరీలు, సెంచరీలు చేస్తూ పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు.
Video Advertisement
జట్టులో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ ఉన్నప్పటికీ, విరాట కోహ్లీ విజృంభిస్తే గెలుపు ఖాయం అని మరోసారి ఈ మ్యాచ్ నిరూపించింది. భారత జట్టు పాకిస్థాన్ పై 228 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓవరాక్షన్ కు భారత్ గుణపాఠం నేర్పిందని నెటిజన్లు మీమ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ వికెట్ తీసిన తరువాత పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓ రేంజ్ లో ఓవరాక్షన్ చేశాడు. అతను చేసిన ఓవరాక్షన్‌కి విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇవ్వాలని ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులందరు కోరుకున్నారు. వారి కోరికను నేరవేర్చదానికి కింగ్ కోహ్లీనే కాకుండా భారత జట్టు అంతా మూకుమ్మడిగా పాక్ బౌలర్లకు మరియు బ్యాటర్లకు ఇచ్చిపడేసారు.
ఓపెనర్లుగా గ్రౌండ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు అర్థసెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్, కేఎల్ రాహుల్ 111 నాటౌట్ గా నిలిచి, పాక్ బౌలర్లను ఆడుకున్నారు. షాహీన్ అఫ్రిదీ,హరీస్ రౌఫ్, నసీమ్ షా, షబాద్ ఖాన్, ఫహీమ్ అశ్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ చేసిన ఓవర్లలో పరుగుల వర్షం కురిపించి, వన్డేల్లో పాకిస్తాన్ ఎప్పుడూ చేధించని లక్ష్యాన్ని పాక్ ముందు పెట్టారు.
పాకిస్థాన్ బ్యాటర్లకు కూడా భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నేపాల్ పై 151 రన్స్ చేసిన బాబర్ అజామ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన ఫఖార్ జమాన్ చేసిన 27 రన్స్ పాకిస్థాన్ బ్యాటర్లు చేసిన అత్యధిక స్కోర్ అంటే భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. కుల్దీప్ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మ్యాచ్ లో ఓవరాక్షన్ చేసిన పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్ తో ఆడుకుంటున్నారు.
Also Read : “ఏంటి బ్రో ఇంత పని చేశావు..?” అంటూ… “జడేజా” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
End of Article