తీవ్రమైన విమర్శలలో చుట్టుకున్న టీ20 వరల్డ్‌కప్ 2022 జట్టు..!

తీవ్రమైన విమర్శలలో చుట్టుకున్న టీ20 వరల్డ్‌కప్ 2022 జట్టు..!

by Anudeep

Ads

అక్టోబరు- నవంబరులో ఆస్ట్రేలియా లో జరగబోతున్న టీ20 వరల్డ్‌కప్ 2022 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు 15 మందితో కూడిన టి20 వరల్డ్ కప్ 2022 జట్టు ను సెలెక్టర్లు ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలైన వెంటనే సెలక్షన్ కమిటీ మరియు టీంలో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ పై విమర్శలు మొదలయ్యాయి.

Video Advertisement

టి20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయబడిన ఈ టీంలో మహ్మద్ షమీ, సంజు శాంసన్‌ని ఎంపిక చేయక పోవడం పై అభిమానులు ఆన్ లైన్ ద్వారా తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రవి బిష్ణోయ్, దీపక్ చాహర్‌కి కూడా అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు.

comments on t20 world cup 2022 team members

టి20 వరల్డ్ కప్ 2022 కు ఎంపికైన భారత జట్టు వివరాలు రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

players who can replace deepak chahar in ipl 2022

అయితే మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టీం టైటిల్ గెలవడానికి కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ. ఆ సిరీస్ లో అతని ఆట తీరును ఎందరో ప్రశంసించారు. అలాంటిది అతన్ని గత కొద్ది రోజులుగా రెస్ట్ పేరుతో పక్కన పెడుతూ వచ్చారు. మొన్న జరిగిన ఆసియా కప్ 2022 లో కూడా అతనికి చోటు ఇవ్వలేదు.మరి ఇప్పుడు టి20 జట్టులో కూడా అతనికి స్థానం కల్పించలేదు.

ఇక సంజు శాంసన్ అయితే ఎప్పటినుంచో ఆతని ఇలా మెగా టోర్నీస్ అన్నిటికీ దూరంగానే ఉంచుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2022లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ కంటే టీ20ల్లో సంజు శాంసన్ ఎంతో నిలకడగా ఆడాడు. అయినా అటువంటి ప్లేయర్ని పక్కన పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కనపెట్టి అశ్విన్‌ని ఎంపిక చేయడంపైనా కూడా అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ బోర్డు టీం సభ్యుల పేర్లు ప్రకటించిన మరు క్షణం నుంచి నెట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


End of Article

You may also like