Ads
ఉప్పల్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. 344 పరుగుల భారీ లక్ష్యాన్ని 10 బంతులు ఉండగానే పాకిస్థాన్ శ్రీలంక పై 6 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది.
Video Advertisement
48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఆటతీరును సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో రెండవ విజయాన్ని సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసింది. 345 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్, ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, 6 వికెట్ల తేడాతో అవలీలగా విజయభేరి మోగించింది. దీంతో 48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు ఐర్లాండ్ జట్టు పేరు మీద ఉండేది.
అయితే ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి ఈ మ్యాచ్ లో దారుణ ప్రదర్శన కంటిన్యూ చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం కాకముందు బాబర్ టాప్ స్కోరర్ గా నిలిస్తాడని కామెంట్లు వినిపించాయి. అయితే వన్డే ప్రపంచకప్-2023లో నెదర్లాండ్స్ బాబర్ పై 5 రన్స్ మాత్రమే చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత నాలుగు మ్యాచ్‌ల నుండి బాబర్ సరిగ్గా ఆడలేదు. గత 5 మ్యాచ్‌ల్లో బాబర్ 71 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బాబర్ ప్రదర్శన పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “వార్మప్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడటం కాదు. ముఖ్యమైన టోర్నీలో ఆడాలని” కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ బాబర్ చెలరేగి ఆడాడు. అయితే మెగా టోర్నీలో దానికి భిన్నంగా ఉంది.
https://twitter.com/AnushSpidey1/status/1711738164438516082?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711738164438516082%7Ctwgr%5E0d807d8b9302ac0bd0aa000b1015a9d67ddb46d5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Ffans-brutally-troll-babar-azam-his-poor-batting-world-cup-2023-1807541
Also Read: ఆ యాడ్స్ ని గ్రౌండ్ పై పెయింట్ వేయరా.? దీనివెనకాల ఇంత పెద్ద కథ ఉందా.?
End of Article