ప్రపంచంలోనే “బెస్ట్ బ్యాటర్” అన్నారు… కానీ వరల్డ్ కప్ లో మాత్రం బ్యాటింగ్ చేయడమే మర్చిపోయారు..! విషయం ఏంటంటే..?

ప్రపంచంలోనే “బెస్ట్ బ్యాటర్” అన్నారు… కానీ వరల్డ్ కప్ లో మాత్రం బ్యాటింగ్ చేయడమే మర్చిపోయారు..! విషయం ఏంటంటే..?

by kavitha

Ads

ఉప్పల్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. 344 పరుగుల భారీ లక్ష్యాన్ని 10 బంతులు ఉండగానే పాకిస్థాన్ శ్రీలంక పై 6 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది.

Video Advertisement

48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే వరల్డ్ నంబర్ వన్  బ్యాటర్ ఆటతీరును సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో రెండవ విజయాన్ని సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసింది. 345 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్, ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, 6 వికెట్ల తేడాతో అవలీలగా విజయభేరి మోగించింది. దీంతో 48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు ఐర్లాండ్ జట్టు పేరు మీద ఉండేది.
అయితే ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి ఈ మ్యాచ్ లో దారుణ ప్రదర్శన కంటిన్యూ చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం కాకముందు బాబర్ టాప్ స్కోరర్ గా నిలిస్తాడని కామెంట్లు వినిపించాయి. అయితే వన్డే ప్రపంచకప్‌-2023లో  నెదర్లాండ్స్‌ బాబర్ పై 5 రన్స్ ​మాత్రమే చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత నాలుగు మ్యాచ్‌ల నుండి బాబర్ సరిగ్గా ఆడలేదు. గత 5 మ్యాచ్‌ల్లో బాబర్ 71 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బాబర్‌ ప్రదర్శన పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “వార్మప్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడటం కాదు. ముఖ్యమైన టోర్నీలో ఆడాలని” కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్ బాబర్‌ చెలరేగి ఆడాడు. అయితే మెగా టోర్నీలో దానికి భిన్నంగా ఉంది.

https://twitter.com/AnushSpidey1/status/1711738164438516082?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711738164438516082%7Ctwgr%5E0d807d8b9302ac0bd0aa000b1015a9d67ddb46d5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Ffans-brutally-troll-babar-azam-his-poor-batting-world-cup-2023-1807541

Also Read: ఆ యాడ్స్ ని గ్రౌండ్ పై పెయింట్ వేయరా.? దీనివెనకాల ఇంత పెద్ద కథ ఉందా.?


End of Article

You may also like