కలిసి ఉండాలని సంకెళ్ళు వేయించుకున్నారు…కానీ చివరికి ఏమైందంటే.?

కలిసి ఉండాలని సంకెళ్ళు వేయించుకున్నారు…కానీ చివరికి ఏమైందంటే.?

by Mohana Priya

Ads

కొంత మంది జంటలు వారి ప్రేమ నిజమా? కాదా? అనే సందేహంలో ఉంటారు. అలాంటప్పుడు వారి ప్రేమ నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రయత్నాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. కొంత కాలం క్రితం జరిగిన ఈ ఘటన చూస్తే మీకు కూడా ఇదే అనిపిస్తుంది.

Video Advertisement

Couple chained together for 123 days

వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం ఉక్రెయిన్ కి చెందిన అలెగ్జాండర్ కుడ్లే, విక్టోరియా పుస్తోవిటోవా అనే ఒక జంట తమ ప్రేమ ఎంత బలమైనదో పరీక్షించుకోవాలి అని అనుకున్నారు. అందుకోసం ఎవరూ తీసుకోని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ తమ చేతులకు సంకెళ్లు వేయించుకున్నారు. అది కూడా కలిసి. ఇలా విడిపోకుండా కలిసి జీవించి తమ మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగించాలని అనుకున్నారు.

Couple chained together for 123 days

చేతికి సంకెళ్లు వేసి ఉండటంతో ప్రేమ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నారు. అలా 123 రోజులపాటు వారిద్దరూ సంకెళ్ళతో గడిపారు. బాత్రూంకి వెళ్ళినా, వంట చేసినా, బట్టలు ఉతికినా, భోజనం చేసినా ఇద్దరు చేతులకు సంకెళ్ళు ఉండేవి. మొదట వారికి ఇదంతా చాలా థ్రిల్  గా అనిపించింది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ వారు అలా కలిసి ఉండలేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సంకెళ్ల రాపిడి వల్ల విక్టోరియా చేతికి ఎలర్జీ వచ్చింది.

Couple chained together for 123 days

దాంతో విక్టోరియాకి వైద్యులు చికిత్స చేసి, ఒట్టి చేతులకు సంకెళ్లు తగలకుండా బ్యాండ్ వాడమని చెప్పారు. వారిద్దరు దగ్గరగానే ఉన్నా కూడా, వారి మనసులు మాత్రం దూరం అయ్యాయి. ఇంకా వారిద్దరూ తాము కలిసి ఉండటం కష్టం అనే విషయాన్ని గ్రహించారు. దాంతో వారి చేతులకు సంకెళ్లు వేసిన నిర్వాహకులను పిలిచి సంకెళ్ళు తెంచమని చెప్పారు.

Couple chained together for 123 days

అయితే 123 రోజులు సంకెళ్లు వేసుకొని, ఇప్పటి వరకు ఏ జంట కలిసి జీవించలేదు. దాంతో వీరిద్దరూ అలా జీవించి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. విక్టోరియా “ఇంక నేను నా జీవితాన్ని గడుపుతాను” అని చెప్పింది. అలెగ్జాండర్ కూడా వారికి సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలియచేసి, ఇకపై తాను ఒంటరిగా ఉంటాను అని చెప్పాడు. ఏదేమైనా వీరి ఐడియా మాత్రం విచిత్రంగా ఉంది కదా.


End of Article

You may also like