Ads
ఒలంపిక్స్ లోకి క్రికెట్ చేర్చాలని చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది.ఐఓసీలో ఈ ప్రతిపాదన పై ఓటింగ్ జరగగా కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో 128 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లోకి క్రికెట్ రానుంది.అయితే ఈ టోర్నీకి ఖచ్చితమైన ఫార్మాట్ ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Video Advertisement
చివరగా 1900 సంవత్సరంలో జరిగిన ఫ్రాన్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఆడారు.అయితే అసలు ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? దానికి దారి తీసిన పరిణామాలు ఏంటి? ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే అంశాలను పరిశీలిస్తే…దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
రకరకాల ఫార్మేట్ లు పరిమిత దేశాలలో మాత్రమే దాని ప్రజాధరణ, బీసీసీఐ వంటి శక్తివంతమైన క్రికెట్ బోర్డుల విముఖత. అయితే క్రికెట్ 20-20 ఫార్మేట్ వచ్చాక ఆట ముఖచిత్రం మారిపోయింది. ఆ తర్వాత ఐసీసీ కూడా ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆటను వీలైనంత ఎక్కువ దేశాలకు తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంది
అయితే దీనికి బీసీసీఐ పెట్టిన షరతులు ఇవే:
ఐసీసీ సభ్య దేశాల్లోని కొన్ని మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. కానీ 20-20 వచ్చాక చాలా మారిపోయింది 2017-2018 లో ఐసిసి టి20 కోసం 104 దేశాలకు సభ్యత్వం ఇచ్చింది.
ఈ చర్య ఒలంపిక్స్ లోకి క్రికెట్ ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. మొదట బిజీ షెడ్యూల్ ఆర్థిక విషయాలు మేరేజ్ వేసుకుని ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలోని క్రికెట్ బోర్డులు ఒలంపిక్స్ లో పాల్గొనడం పైన పెద్దగా శ్రద్ధ చూపలేదు.
ఆ తర్వాత ఈ దేశాల అభిప్రాయాల్లో మార్పు వచ్చింది భారత ఒలంపిక్ సంఘం జోక్యం ఉండకూడదని శరత్ పై టీమ్ ఇండియన్ ఒలంపిక్స్ కు పంపడానికి సిద్ధంగా ఉన్నామని 2021లో బీసీసీ ప్రకటన చేసింది. అదే క్రమంలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ , దక్షిణాసియా, పసిఫిక్ గేమ్స్ లో కూడా క్రికెట్ చేర్చినప్పుడు మంచి స్పందన వచ్చింది. ఇది కూడా క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చే ప్రయత్నాలకు బలం చేకూరింది.
Also Read:ఈ టీంకి తిప్పలు తప్పవని నాకు ముందే తెలుసు..!” అంటూ… మాజీ పాకిస్తాన్ ప్లేయర్ కామెంట్స్..!
End of Article