“ఈ టీంకి తిప్పలు తప్పవని నాకు ముందే తెలుసు..!” అంటూ… మాజీ పాకిస్తాన్ ప్లేయర్ కామెంట్స్..!

“ఈ టీంకి తిప్పలు తప్పవని నాకు ముందే తెలుసు..!” అంటూ… మాజీ పాకిస్తాన్ ప్లేయర్ కామెంట్స్..!

by Mounika Singaluri

Ads

2023 క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఇప్పుడు విమర్శలు పాలవుతుంది. బ్యాటింగ్ లోను విఫలమవుతూ, బౌలింగ్ లో విఫలం అవుతూ ఫీలింగ్ అవుతూ పాకిస్తాన్ ఇప్పుడు అట్టడుగు స్థాయికి పడిపోయింది. జట్టు విఫలం అవ్వడానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంటూ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు.

Video Advertisement

ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కొక తప్పదని ఘాటు విమర్శలు చేశాడు. స్వప్రయోజనాల కోసం జట్టు ప్రతిష్టను భ్రస్టు పట్టిస్తున్నారని మండిపడ్డాడు.

ఈ టీం సెలక్షన్ మొత్తం తప్పులు తడకగా ఉందని, నసిం షా అందుబాటులో లేడని, హసన్ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు కేవలం మేనేజ్మెంట్లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగానే జట్టులోకి వచ్చాడని అన్నారు. ఇక ఉసామామీర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్ కు ఆడతాడు. ముస్తాక్ అహ్మద్ కు చీఫ్ సెలెక్టర్ ఇంజమాం ఉల్ హక్ తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలు అనుగుణంగా ఆటగాళ్లు ఎంపిక జరుగుతుంది. దేశ ప్రతిష్ట గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు.

పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇద్దరు లెగ్ స్పిన్నర్ లతో బరిలోకి దిగింది లేదు. షాహిద్ అఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుండి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు షాదాబ్ ఖాన్ నీ తప్పించి ఉసామా మిర్ ను రప్పించారు అని అన్నాడు.

కాగా పాకిస్తాన్ వరుస ఓటమిల నేపథ్యంలో కెప్టెన్ గా బాబర్ ఆజామ్ ను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.ఇక పాకిస్తాన్ ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్ లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమిస్ రేస్ లో నిలవాలంటే మిగిలిన మ్యాచ్ లలో తప్పక గెలవాలి.

 

Also Read:వరల్డ్ కప్ 2023 మీద ఉన్న ఈ 9 సింబల్స్ గమనించారా.? వాటికి అర్ధం ఏంటో తెలుసా.?


End of Article

You may also like