Ads
చాల మంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి ఆక్టర్ అయ్యాం అని చెబుతూ ఉంటారు. చాలామందికి వాళ్ళ వాళ్ళ పాషన్స్ ఉంటాయి. అనుకోకుండా యాక్టర్ గా క్లిక్ కావడం, లైమ్ లైట్ లో మంచి ఆఫర్లు రావడం తో చిత్రసీమ లోనే సెటిల్ అయిపోతారు. అలానే, క్రికెట్ అంటే పిచ్చి ఉండి, క్రీజ్ లోకి దిగితే బాట్ తో బాదేయగల వీరులు కూడా ఉన్నారు మన టాలీవుడ్ హీరోల్లో.. వారి లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఓ లుక్ వేద్దాం రండి.
Video Advertisement
#1 సాయి ధరమ్ తేజ్:
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి క్రికెట్ అంటే ఇంటరెస్ట్. మొదట్లో సాయి ధరమ్ తేజ్ క్రికెట్ నే తన ఫీల్డ్ గా ఎంచుకున్నాడు. ఆ తరువాత, ట్రాక్ మార్చి సినిమాల్లోకి వచ్చాడు.2015 , 2016 CCL ఎడిషన్స్ లో తెలుగు వారియర్ తరపున సాయి ధరమ్ తేజ్ ఇరగదీసేసాడు.
#2 అక్కినేని అఖిల్
టాలీవుడ్ సిసింద్రీ అక్కినేని అఖిల్ కూడా బాట్ పట్టుకుంటే చెలరేగిపోతాడు.మొదట్లో అఖిల్ కూడా క్రికెట్ లోనే కెరీర్ చూసుకోవాలి అనుకున్నాడు. అందుకోసం ఆస్ట్రేలియా లో కోచింగ్ కూడా తీసుకున్నాడు. సినిమా క్రికెట్ లీగ్ (CCL ) 2010 లో అఖిల్ మాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అంతే కాదు 2015 , 2016 , 2017 CCL లలో తెలుగు టీం ని విన్నర్ గా నిలబెట్టాడు.
#3 తరుణ్:
తరుణ్ సినిమాల్లోకి రాకముందు నుంచి క్రికెట్ ప్లేయర్. రంజీ మ్యాచ్ లలో కూడా తరుణ్ కీ రోల్ ప్లే చేసాడు. సినిమాల్లోకి వచ్చాకే తరుణ్ క్రికెట్ పైన దృష్టి తగ్గించాడు. తరుణ్ మంచి బ్యాట్స్ మెన్.
#4 సచిన్ జోషి:
సచిన్ జోషి తెలుగు సినిమాల్లో నటించాడు. ఇతను పూర్తిగా తెలుగువాడు కానప్పటికీ టాలీవుడ్ ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నాయి. మౌనమేలనోయి, ఒరేయ్ పండు , నీ జతగా నేనుండాలి సినిమాల్లో సచిన్ జోషి హీరో గా చేసాడు. ఇతను తెలుగు వారియర్స్ టీం లో మంచి ఓపెనర్. క్లాసిక్ షాట్స్ తో బ్యాటింగ్ చేస్తాడు.
#5 అశ్విన్:
యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్. తెలుగునాట రాజుగారి గది, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాల్లో హీరో గా నటించాడు. అశ్విన్ కూడా బ్యాటింగ్ బాగా చేస్తాడు.
#6 ప్రిన్స్:
బిగ్ బాస్ 2 ద్వారా ప్రిన్స్ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. క్రికెట్ లో కూడా ప్రిన్స్ ఇరగదీస్తాడు. తెలుగు వారియర్స్ టీం విజయం లో ప్రిన్స్ కూడా కీ రోల్ ప్లే చేసాడు.
#7 నిఖిల్:
హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా హీరో నిఖిల్ కూడా మంచి బ్యాట్స్ మెన్.
#8 విక్టరీ వెంకటేష్:
క్రికెట్ అంటే వెంకటేష్ కి ఎంత ఇంటరెస్ట్ అన్న సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎక్కడ మ్యాచెస్ జరుగుతున్నా ఒక్కదాన్ని అయినా లైవ్ లో చూడడానికి ప్రయత్నం చేస్తాడు మన వెంకీ. తానూ అంతగా ఆడలేకపోయినా తెలుగు వారియర్స్ ఆడే మ్యాచెస్ లో కూడా డగౌట్ లో ఉంటూ అందరు యూత్ ను ఫుల్ ఖుష్ చేస్తాడు.
#9 సుధీర్ బాబు:
సుధీర్ బాబు వాస్తవానికి మంచి బాడ్ మింటన్ ప్లేయర్. తనొక నేషనల్ లెవెల్ బాడ్ మింటన్ ప్లేయర్. పుల్లెల గోపీచంద్ సహచరుడిగా చాలా టోర్నమెంట్లే ఆడాడు. క్రికెట్ లో కూడా ఇరగదీస్తాడు మన హీరో.
#10 నితిన్:
జయం సినిమా తో వెండితెర కు పరిచయం అయినా హీరో నితిన్ కూడా క్రికెట్ బాగా ఆడతాడు. తనొక మంచి బ్యాట్స్ మెన్.
#11. అజయ్
#12. తారక రత్న
#13. శ్రీకాంత్
#14. ఆదర్శ్
#15. రామ్ చరణ్
End of Article