ఐపీఎల్ టోర్నమెంట్ లో యువ ఆటగాళ్లకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఫ్రాంచైజీలు వయసు పెరిగిన సీనియర్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించవు. అవకాశాలు లేకపోవడం వల్ల సీనియర్ క్రికెటర్లు ఐపీఎల్ నుండి తప్పుకుంటూ ఉంటారు.

Video Advertisement

ఈ నేపధ్యంలో ఈ ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ధోనీ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అయితే ఈ సీజన్ ధోనీకి మాత్రమే చివరిది కాదు. మరి కొందరు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఇదే ఆఖరి ఐపీఎల్ అంటున్నారు. అలా వీడ్కోలు చెప్పబోతున్న సీనియర్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.ధోని:
ఈ లిస్ట్ లో ధోని మొదటి వరుసలో ఉన్నాడు. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ధోనీకి 41 ఏళ్ళు. అందువల్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని అంటున్నారు. మే 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో  చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ధోని చివరి ఐపిఎల్ మ్యాచ్‌ అంటున్నారు. కాగా గతంలో ధోనీ తాను చెపాక్‌లోనే గుడ్ బై చెప్తానని తన ఫ్యాన్స్ తెలిపారని టాక్.
2.అమిత్ మిశ్రా :
ధోని తర్వాత ఐపిఎల్ టోర్నీలో సీనియర్ గా అమిత్ మీశ్రా కొనసాగుతున్నాడు. అతనికి ప్రస్తుతం 40 ఏళ్ళు. అమిత్ మిశ్రా ఈ సంవత్సరం లక్నో సూపర్ జెయింట్స్ తరుపున అడుతున్నాడు. అయితే అతను కూడా ఐపిఎల్ సీజన్లో  వీడ్కోలు చెప్పే అవకాశం ఉందంట.
3.దినేష్ కార్తీక్ :
37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు బెంగళూరు జట్టు తరుపున అడుతున్నాడు. దినేష్ వచ్చే ఐపీఎల్ సీజన్ సమయంలో ఈ టోర్నీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని సమాచారం.
4.ఇషాంత్ శర్మ :
భారత వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మను ఈ ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసుకోవడం అదృష్టమని చెప్పవచ్చు.  35 ఏళ్ళ ఈ సీనియర్ బౌలర్ పై ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో వచ్చే ఐపీఎల్ లో ఆడటం కష్టమే అంటున్నారు.
5.అంబటి రాయుడు :
అంబటి రాయుడు ప్రస్తుతం చెన్నై జట్టుకి అడుతున్నాడు.  37 ఏళ్ల రాయుడు చెప్పుకోదగ్గ రీతిలో ఆడటం లేదు.
దానివల్ల ఇదే అంబటి రాయుడు ఆఖరి ఐపీఎల్ సీజన్ అని అందరు భావిస్తున్నారని చెప్పవచ్చు.

Also Read:“కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్..!” అంటూ… RCB VS PBKS మ్యాచ్‌లో “బెంగళూరు” గెలవడంపై 15 మీమ్స్..!